38.2 C
Hyderabad
Sunday, May 3, 2026
spot_img

టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన పై చర్చ

         నేడు జనసేన, టీడీపీ ఉమ్మడి సమావేశం జరగనుంది. రెండు పార్టీల నేతలు కలసి రానున్న ఎన్నికల్లో కలసి నడిచేందుకు అవసరమైన రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయనున్నారు. దీంతో పాటు ఉమ్మడి మ్యానిఫేస్టో రూపకల్పన, ప్రచార వ్యూహాలపై చర్చ జరగనుంది. సీట్ల పంపకాలపై కూడా చర్చ జరపనున్నారు. ప్రధానంగా రెండు పార్టీలు ఉమ్మడి మ్యానిఫేస్టోను రూపొందించనున్నారు. ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో తొలి విడత మ్యానిఫేస్టోను చంద్రబాబు విడుదల చేశారు. మ్యానిఫేస్టోను ఈసారి ఉమ్మడిగా రూపొందించాలని నిర్ణయించారు. అందుకే రెండు పార్టీల నేతలు కలిసి కూర్చుని సమన్వయంతో మ్యానిఫేస్టోను రూపొందించనున్నారు. దీంతో పాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కలసి పాల్గొనేలా సభలను ఏర్పాటు చేసేందుకు కూడా ఒక రోడ్డు మ్యాప్ ను రూపొందించనున్నారు.

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్