32.8 C
Hyderabad
Thursday, March 5, 2026
spot_img

చింతమనేనికి ఈ సారి టికెట్ నో అన్న చంద్రబాబు

     దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు వరుస వివాదాలు తన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి . ఒకపక్క ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభాకర్ వ్యవహార శైలి తెలుగుదేశం పార్టీ నేతల్లో సైతం కలవరం పుట్టిస్తుంది. చింతమనేని ప్రభాకర్ వ్యవహార శైలి పై పార్టీ నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు . ఈసారి చింతమనేని ప్రభాకర్ కు టిక్కెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయమని మీడియా సమావేశాలు కూడా పెడు తున్నారంటే దెందులూరు లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. దెందులూరు టైగర్ అంటూ ముద్దుగా పిలుచుకునే చింతమనేని గ్రాఫ్ నానాటికి దిగజారి పోతుందనే చెప్పుకోవాలి. చింతమనేని ప్రభాకర్ కు వివా దాలు ఏమీ కొత్త కాకపోయినా ఇప్పుడు వచ్చిన కొత్త వివాదం అతనికి షాక్ తగిలే లాగే ఉంది.

     చింతలపూడి లో చంద్రబాబు నాయుడు బహిరంగ సభ సందర్భంగా ఈసారి తన ప్రతాపం మీడియా ప్రతినిధుల పై చూపించారు. ధర్మాజీ గూడెం వద్ద ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న చింతమనేని ప్రభాకర్ ను సెల్ ఫోన్ ద్వారా మీడియా ప్రతిని ధులు కవరేజ్ చేస్తుంటే తన అనుమతి లేకుండా ఎందుకు చిత్రీకరిస్తున్నారు అంటూ మీడియా సిబ్బంది సెల్ఫోన్ తీసుకొని వారిని దుర్భాషలాడం తో కొత్త వివాదానికి తెర తీశారు. మీడియా ప్రతినిధులపై చింతమనేని దాడిని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేయగా పోలీసు ఉన్నతాధికారులకు చింతమ నేని ప్రభాకర్ పై ఫిర్యాదు చేయడం జరిగాయి. అయితే ఈ వివాదం చంద్రబాబు వద్దకు చేరడంతో చింతమనేని ప్రభాక ర్‌ను తాడేపల్లి పార్టీ కార్యాలయంకు పిలిపించుకొని చివాట్లు పెట్టినట్లు సమాచారం. ప్రభాకర్ ను పద్ధతి మార్చుకో కపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని, చంద్రబాబు నాయుడు హెచ్చరించినట్లు కూడా సమాచారం.

      చంద్రబాబు నాయుడు పిలవడం తనకు దెందులూరు టిక్కెట్టు కన్ఫర్మ్ చేస్తారని ఎంతో ఆశగా వెళ్లిన చింతమనేని ప్రభాకర్ కు చంద్రబాబు నాయుడు నుండి ఈ రకంగా చివాట్లు ఎదురవడం  ప్రభాకర్ ఊహించలేదని అతని అనుచరులు వాపోతున్నారు. టిక్కెట్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఎటువంటి హామీ ఇవ్వలేదని వార్తలు వినిపిస్తున్నా యి. పార్టీ చేసిన సర్వేలో చింతమనేని ప్రభాకరపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు సర్వే ఫలితాలు ఉన్నాయని టిక్కట్టు ఇవ్వ డం కష్టం అని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. టికెట్ తనకి కాకపోయినా తన భార్య కైనా కేటాయించాలని చంద్ర బాబు నాయుడుని ప్రభాకర్ విజ్ఞప్తి చేశారని, అందుకు కూడా చంద్రబాబు నాయుడు అంగీకరించలేదని నియోజవర్గం లో వార్తలు వినిపిస్తున్నాయి. టిక్కెట్టు వస్తుందని సంతోషంలో పార్టీ నేతలు హనుమాన్ జంక్షన్ నుంచి భారీ ర్యాలీ ఏర్పాటుకు అన్ని సిద్ధం చేసుకున్నారు. తీరా వారి ఆశలపై చంద్రబాబు నాయుడు నీళ్లు చల్లడంతో చింతమనేని అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్