కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. ఇప్పటికే మంకీ వ్యాధి బారిన పడిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందా రు. కర్ణాటకలో 100కు పైగా మంకీ ఫీవర్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంకీ ఫీవర్‌తో అలర్టయిన కర్ణాటక ప్రభు త్వం..శివమొగ్గ, చిక్కమగళూరు జిల్లాల ఆరోగ్య అధికారులను అప్రమత్తం చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.మంకీ ఫీవర్‌ను క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్‌గా పిలుస్తారు. కోతుల్లో ఉండే పేలు మనుషుల్ని కుట్టడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ ఫీవర్ వచ్చిన వారికి మూడు నుంచి ఐదు రోజుల పాటు తీవ్ర జ్వరం… ఒళ్లు నొప్పులు, తలనొప్పి, జలుబు, దగ్గు ఉంటాయి.