ప్రస్తుత రోజులలో కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా సరే టీ తాగడం చాలా మందికి అలవాటుగా మారిపోయింది.ఉదయాన్నే టీ తాగకపోతే చాలామందికి ఏం తోచదు. ఫస్ట్ ఓ కప్ టీ కడుపులో పడ్డాకే రోజువారి పనులు స్టార్ట్ చేస్తారు. కాస్త తలపోటుగా అనిపించినా.. వెంటనే స్టౌ ఆన్‌చేసి గరగరం చాయ్‌ని తాగేస్తుంటారు. ‘టీ’కి ఉండే ప్రాధాన్యత అలాంటిది. లేబర్ వర్కర్ మొదలు.. కార్యాలయాల్లో పెద్ద పెద్ద ఉద్యోగుల వరకు టీ తాగనిదే పని ముందుకు కదలని పరిస్థితి ఉంటుంది. అంతలా బాడీని రిఫ్రెష్ చేస్తుంది టీ. అందుకే.. అందరూ టీ తాగేందుకు చాలా ఆసక్తి చూపుతారు. కొందరు రోజంతా టీ తాగుతూ కూడా ఉంటారు. అయితే, ఎక్కువగా టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు.
ఉదయాన్నే కాసింత వేడి వేడి తేనీరు కడుపులో పడందే ఊపిరి సలపదు కొందరికి. .మరికొందరు అయితే కాస్త తలనొప్పిగా అనిపించినా.. వెంటనే స్టౌ ఆన్‌చేసి గరగరం చాయ్‌ని తాగేస్తుంటారు. ‘టీ’కి ఉండే ప్రాధాన్యత అలాంటిది. లేబర్ వర్కర్ మొదలు.. కార్యాలయాల్లో పెద్ద పెద్ద ఉద్యోగుల వరకు టీ తాగనిదే పని ముందుకు కదలని పరిస్థితి ఉంటుంది. అంతలా బాడీని రిఫ్రెష్ చేస్తుంది టీ. అందుకే.. అందరూ ఈ చాయ్ చటుక్కున తాగరా భాయ్ అంటూ రెడీ అయిపోతారు.
నిపుణులు చెప్పేదాని ప్రకారం టీ, కాఫీలో కెఫీన్ ఉంటుంది. కాబట్టి వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలని సూచిస్తున్నారు. రాత్రి పడుకునే ముందు టీ, కాఫీ తాగకూడదు. దీనివల్ల సరిగ్గా నిద్రపోలేరు. అలాగే ఉదయం ఖాళీ కడుపుతో కూడా టీ తాగకూడదు. టీ తాగడానికి ఒక సమయం, నియమం ఉంది. ఇది కొందరికి మాత్రమే తెలుసు. కానీ చాలామంది పొద్దున్నే టీ తాగడానికి ఇష్టపడతారు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కలిగే నష్టాల గురించి ఒకసారి చూద్దాం.
ఉదయాన్నే టీ తాగితే రోజంతా హుషారుగా ఉంటారని చాలా మంది అనుకుంటారు. కానీ అది తప్పు. దీనికి విరుద్ధంగా, రోజంతా నీరసంగా ఉంటారు, చిరాకు వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే వికారం వస్తుంది. ఇది కాకుండా అల్సర్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఖాళీ కడుపుతో టీ తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.పొద్దున్నే టీ తాగడం వల్ల కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియా దెబ్బతింటుంది. దీంతో జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. టీలో ఉండే డ్యూరెటిక్ మూత్ర విసర్జన ప్రక్రియను వేగవంతం చేయడం వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. ఇది కాకుండా ఎసిడిటీ, నోటి దుర్వాసన కూడా వస్తాయి.పొద్దున్నే టీ తాగితే శరీరంలో పోషకాలు గ్రహించబడవు. అంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందకుండా పోతాయి. పళ్లు పాడవుతాయి, గుండెల్లో మంట వస్తుంది. సో .. టీ తాగండి .. కానీ మితంగా తాగండి .. మరీ పొద్దున్నే ఖాళీ కడుపుతో అస్సలు తాగేయకండి .
అయితే, మమ్ములు టీ కంటే హెర్బల్ టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. రకరకాల హెర్బల్ టీ లతో.. వేర్వేరు ఆరోగ్యపరమైన సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి అని చెబుతున్నారు. వీటిలో ఒకటి హైబిస్కస్ టీ .. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తపోటు తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. గుండె, కాలేయం ఆరోగ్యంగా ఉండేలా సాయపడుతుంది. దీని రంగు ఎర్రగా ఉంటుంది. కొవ్వును తగ్గించే లక్షణాలు మందార టీలో పుష్కలంగా ఉన్నాయి.
ఇక చమోమిలే టీ .. కాస్త దిగులుగా, ఒత్తిడిగా, అలసటగా ఉంటే ఈ చేమంతి టీ తాగితే ఉపశమనం ఉంటుంది. గొంతులో మంట, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది, పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని కూడా ఈ టీ తగ్గిస్తుంది. నిద్ర పట్టకపోతే ఒక కప్పు చేమంతి టీ తాగితే ఫలితం ఉంటుంది. ఇది చర్మ సమస్యల్ని దూరం చేయడంలో గొప్పగా పనిచేస్తుంది. . ఇది ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు. చామంతి పూలని తీసుకొచ్చి ఆరబెట్టి ఈ టీని తయారు చేసుకోవచ్చు. స్టౌ మీద ఓ గ్లాసు నీటిని వేడి చేయండి. ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఎండిన చమోమిలే పువ్వులని జోడించండి. కొన్ని నిమిషాల పాటు బాగా మరిగాక వడకట్టి కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగాలి.
లెమన్ టీని స్ట్రెస్ బర్నర్ అని కూడా అంటారు. 2004లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్‌లో మానసిక ఒత్తిడితో బాధపడుతున్న కొంతమంది పాల్గొన్నారు. వారికి 600 mg లెమన్ టీని క్రమం తప్పకుండా అందిచారు. ఈ పరిశోధన ఫలితాలు చాలా సానుకూలంగా వచ్చాయి. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించి.. చర్మ సంబంధవ్యాధుల నుంచి కాపాడుతుంది. అలాగే అటు అల్లం టి కూడా జీర్ణశక్తి పెంచడంలో, వాంతులు, తలతిరగడం లాంటి సమస్యలు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
వర్షాకాలంలో వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యల్ని తగ్గిస్తుంది. ఒక కప్పు రోజ్ టీ ఆందోళనను తగ్గించడానికి, స్ట్రెస్‌ను కంట్రోల్ ఉంచడానికి సహాయపడుతుంది. గులాబీలోని పోషకాలు విశ్రాంతిని కలిగిస్తాయి, ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో, నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడతాని అధ్యయనాలు చెబుతున్నాయి. నరాలను శాంతపరిచి ఒత్తిడి, ఆందోళనలనూ దూరం చేస్తుంది. రోజ్ టీ వేడిగా కంటే చల్లగా రుచి ఇంకా బాగుంటుంది. మహిళలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను అరికడుతుంది. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు, రోగ నిరోధక శక్తి పెంచే ఏజెంట్లుంటాయి. శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం ఇస్తుంది . ఈ టీ చాలా రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. తులసి టీ నిద్రలేమి సమస్యలను తగ్గిస్తుంది.