20.7 C
Hyderabad
Friday, February 7, 2025
spot_img

సుకుమార్ ఇంట్లో ఐటీ రైడ్స్

డైరెక్టర్‌ సుకుమార్‌ ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పుష్ప 2 వసూళ్లకు తగ్గట్టుగా ఐటీ చెల్లింపులు జరగలేదని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తున్నారు.

దర్శకుడు సుకుమర్ ఇంట్లో కూడా నిన్న ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. సుకుమార్‌ విదేశాలలో ఉన్నారు. అయితే ఐటి అధికారులు ఎయిర్‌ పోర్ట్ నుంచే సుకుమార్‌ను ఇంటికి తీసుకుని వెళ్లారు. కోండాపుర్‌లోని డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. Esmeralada Fortune లోని గ్రేటర్ కమ్యునిటీ విల్లా నెంబర్‌ 43 లో సుకుమార్ నివాసం ఉంటున్నారు.

నిర్మాతల ఇళ్లలో రెండో రోజు ఐటీ సోదాలు

తెలుగు సినీ నిర్మాతల ఇళ్లలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నిర్మాతలకు ఫైనాన్స్ చేసిన ఫైనాన్సర్లను సైతం విచారిస్తున్నారు ఐటీ అధికారులు. భారీ బడ్జెట్ సినిమాలు రూపొందించిన నిర్మాతల ఇళ్ళు కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. 55 బృందాలుగా ఎనిమిది చోట్ల సోదాలు చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్,బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్ లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కు చెందిన SVC బ్యానర్‌తో పాటు, మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. పుష్ప-2 బడ్జెట్‌, వచ్చిన ఆదాయంపై అధికారుల ఆరా తీస్తున్నారు. ఐటీ రిటర్న్స్‌ భారీగా ఉండడంతో ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న దిల్‌ రాజు భార్య తేజస్వినితో బ్యాంకు లాకర్లు తెరిపించారు. ఇవాళ మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించనున్నారు. ఎస్‌వీసీ ఆఫీస్‌కు దిల్‌ రాజును తీసుకెళ్లే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

దిల్ రాజు నివాసం, కూతురు హన్సిత నివాసం, సోదరుడు శిరీష్ నివాసాల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయం .. నవీన్ ఎర్నెని, రవి శంకర్ నివాసాలు.. మ్యాంగో సంస్థల యజమాని యరపతినేని రామ్ ఇళ్ళు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. సంక్రాంతి నేపథ్యంలో వచ్చిన భారీ సినిమాల పెట్టు బడులు, ఆదాయం పైన ఆరా తీస్తున్నారు. ఆయా సంస్థల బాలెన్స్ షీట్స్ ను పరిశీలిస్తున్నారు ఐటీ అధికారులు.

Latest Articles

‘ఎటర్నల్‌’ గా జొమాటో రీ బ్రాండ్‌.. కొత్త లోగో

ఇండియన్‌ ఫుడ్‌ అండ్‌ గ్రాసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్‌.. జొమాటో తన పేరు మార్చుకుంది. కంపెనీ ప్రతినిధులు ఈ విషయాన్ని గురువారం వెల్లడించారు. జొమాటో కాస్తా 'ఎటర్నల్‌' గా మారింది. కొత్త లోగోను కూడా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్