ఇన్నర్‌రింగ్ రోడ్డు, మద్యం, ఉచిత ఇసుక కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఇవాళ ఆయన సీఐడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు సంబంధిత దర్యాప్తు అధికారులకు ఆయన పూచీకత్తుతో పాటు లక్ష విలువ గల బాండ్ సమర్పించనున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి మధ్యాహ్నం ఉండవల్లిలోని నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు. మధ్యాహ్నం గుంటూరు నగరంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి వెళతారు. సాయంత్రం తాడేపల్లి, తాడిగడపలోని సీఐడీ కార్యాలయాలకు కూడా వెళ్లి పూచీకత్తు, బాండ్ సమర్పిస్తారు.