23.7 C
Hyderabad
Tuesday, March 25, 2025
spot_img

ఢిల్లీకి సీఎంగా మహిళ?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి రావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. దశాబ్దానికి పైగా ఢిల్లీని పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడమే కాకుండా.. ఆ పార్టీ అగ్ర నాయకులను కనీసం ఎమ్మెల్యేలుగా కూడా గెలవకుండా చేసింది. ఆప్ కంచుకోటల్ని బీజేపీ బద్దలు కొట్టింది. ఫిబ్రవరి 8న ఫలితం వెలువడిన తర్వాత.. ఇక ఢిల్లీకి సీఎం ఎవరు అవుతారా అనే చర్చ మొదలైంది. ఫలితాలు వచ్చి మూడు రోజులు గడిచిపోయినా.. ఇంత వరకు బీజేపీ లెజస్లేటీవ్ పార్టీ సమావేశం జరగలేదు. బీజేజీ అధిష్టానం సీఎం అభ్యర్థి విషయంలో అన్ని రకాల సమీకరణలను బేరీజు వేస్తూ.. కసరత్తు చేస్తుంది.

బీజేపీ ఎక్కడైతే ఆగిపోయిందో.. అక్కడి నుంచే మొదలు పెడుతుందనే ప్రచారం జరుగుతుంది. 1998లో బీజేపీ నేత సుష్మా స్వరాజ్ 52 రోజుల పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. అ తర్వాత జరగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి.. మళ్లీ తాజాగా అధికారంలోకి వచ్చింది. దీంతో ఈ సారి మరో మహిళను సీఎం పదవిలో కూర్చోబెట్టాలని భావిస్తోందట. ఇప్పటికే గెలిచిన మహిళా ఎమ్మెల్యేల నుంచ కీలకమైన వారి పేర్లను బీజేపీ అధిష్టానం గుర్తించినట్లు తెలిసింది. మహిళ సీఎంను నియమించడం ద్వారా దేశమంతటా సానుకూల వాతావరణం ఏర్పడుతుందని బీజేపీ భావిస్తోంది.

షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి గెలిచిన రేఖా గుప్తా పేరు అందరి కంటే ఎక్కువగా వినిపిస్తోంది. తాజా ఎన్నికల్లో సుమారు 30 వేల ఓట్ల మెజార్టీతో రేఖా గుప్తా గెలిచారు. పైగా ఆమె బీజేపీ మహిళా విభాగానికి జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఢిల్లీ బీజేపీ విజయంలో రేఖా గుప్తా కీలక పాత్ర పోషించారు. మరోవైపు గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి గెలిచిన శిఖా రాయ్ పేరు కూడా వినిపిస్తుంది. ఆప్ అగ్రనేత సౌరభ్ భరద్వాజ్‌ను ఓడించిన శిఖా రాయ్.. అందరి దృష్టిని ఆకర్షించారు. ఇఇక వాజిర్‌పూర్ నుంచి ఎన్నికైన పూనమ్ శర్మ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఆమె అక్కడి నుంచ 11,425 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నజఫ్‌గఢ్ నుంచి విజయం సాధించిన నీలమ్ పెహల్వాన్ పేరును కూడా బీజేపీ ప్రాబబుల్స్ లిస్టులో చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి.

కేవలం గెలిచిన ఎమ్మెల్యేల నుంచే కాకుండా.. పార్టీలోని కీలక నేతల పేర్లను కూడా సీఎం పదవి కోసం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. గత ఎన్డీయే ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేసిన స్మృతి ఇరానీ పేరును బీజేపీ పరిశీలిస్తోందట. 2024 ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌కు చెందిన కిశోరీ లాల్ చేతిలో ఓడిన స్మృతి.. కొంత కాలంగా లైమ్ లైట్‌లో కనపడం లేదు. అయితే స్మృతి సేవలను ఢిల్లీలో వాడుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఢిల్లీ మాజీ సీఎం, దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సురీ స్వరాజ్ పేరు కూడా లిస్టులో చేర్చారు. ప్రస్తుతం న్యూఢిల్లీ ఎంపీగా ఉన్న బాన్సురీని సీఎం చేయాలని పార్టీలో కొంత మంది ప్రతిపాదించినట్లు తెలిసింది. అయతే పాలనానుభవం పెద్దగా లేకపోవడం బాన్సురికి మైనస్‌గా మారింది.

ఢిల్లీకి మహిళను సీఎంగా చేస్తే.. దళితులకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ కేబినెట్‌లో మహిళలు, దళితులు, వెనుకబడిన తరగతుల వారికి ప్రాధాన్యం ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. త్వరలోనే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారని.. ఆ వెంటనే బీజేపీ లెజిస్లేటీవ్ మీటింగ్ పెట్టి.. అధికారికంగా లెజిస్లేటీవ్ లీడర్‌ను ఎన్నుకుంటారు. అయితే ప్రస్తుతం ప్రధాని మోడీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనల్లో ఉన్నారు. ఫిబ్రవరి 14 తర్వాత ఆయన ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాలే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది. మరి ఢిల్లీకి కొత్త సీఎం ఎవరు అవుతారో వేచి చూడాలి.

Latest Articles

‘మ్యాడ్ స్క్వేర్’లో ‘మ్యాడ్’ని మించిన కామెడీ ఉంటుంది: మ్యాడ్ గ్యాంగ్

బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్' కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్