Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

కాంగ్రెస్ నిధులను అడ్డుకున్న మోదీ సర్కార్

    సార్వత్రిక ఎన్నికల వేళ.. దేశంలో అతిపెద్దరాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ తన సొంత నిధులను ఉప యోగించకుండా భారత ప్రభుత్వం నిరోధించడం పట్ల ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నా రు. ఇది అమెరికాలో మాజీ అధ్యక్షు డు నిక్సన్ హయాంలో జరిగిన వాటర్ గేట్ కుంభ కోణం కన్నా దారుణం అని దుమ్మెత్తి పోస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్న మోదీ ఆలోచననే ఐటీ, ఈడీ, ఇతరద ర్యాప్తు సంస్థలు అమలు చేస్తున్నాయా అని నిలదీస్తున్నారు. దేశంలో స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఎన్నిక లను నిర్వహించడం ద్వారా నిజమైన ప్రజాస్వామ్యం నెలకొల్పేందుకు కృషి జరగాలని అంటున్నారు.

కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్ 2024 పార్లమెంటు ఎన్నికల్లో నెగ్గి తిరిగి మూడో టర్మ్ అధికారంలోకి రావాలని సర్వ శక్తులూ ఫణంగా పెట్టి పోరాడుతోంది. దేశంలో ప్రస్తుతం రాజకీయాలు చూస్తే.. 2014, 2019 కన్నా బీజేపీ, ఎన్డీఏ క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇటీవలి కాలంలో మోదీ సర్కార్ ఏకపక్ష నిర్ణయా లు.. నియంతృత్వ ధోరణుల పట్ల ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చెందుతు న్నాయి. దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలుగా పేరొం దిన ఎన్నికల కమిషన్ కు ఈసీ, సిఈసీ నియామకాల కమిటీలో సుప్రీంకోర్టు సిజేఐ తప్పించి.. కేంద్రమంత్రికే స్థానం కల్పించడం, ప్రతిపక్షాల నుంచి ఎంత ప్రతిఘటన ఎదురైనా, పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలుకు సిద్ధమవ డం ఇందుకు ఉదాహరణలు.

    నిజానికి అమెరికాలో జరిగిన వాటర్ గేట్ కుంభకోణానికి, ప్రస్తుతం కాంగ్రెస్ నిధుల స్తంభనకు పోలికలు లేకపోవచ్చు. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ యంత్రాంగం ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీని అడ్డుకునేందుకే అక్రమా లకు పాల్పడింది. వాషింగ్టన్ డీసీలోని వాటర్గేట్ వ్యవహారంలో డెమొక్రటిక్ పార్టీ ప్రచార ప్రధాన కార్యాలయం నుంచి సున్నితమైన రాజకీయ సమాచారాన్ని దొంగిలించడానికి నిక్సన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు వెల్లడైంది. అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియలను నిర్వీర్యం చేయడానికి జరిగిన కుట్ర ఇది. ఫలితంగా రిచర్డ్ నిక్సన్ అర్థాంతరంగా పదవి విరమణ చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక రాజకీయ పార్టీలలో ఒకటి. గొప్ప చరిత్ర గలిగిన పార్టీ. భారత స్వాతంత్ర్య సమరంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర తెలిసిందే. దాదాపు 50 ఏళ్లకు పైగా భారత రాజకీయాలను శాసించిన పార్టీ. అలాంటి పార్టీ రానున్న ఎన్నికల్లో సమర్థంగా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్న వేళ.. ఆర్థిక మూలాలను దెబ్బతీయడం. ఐటీ దాడులు, నిధుల స్తంభన వంటి చర్యలు ప్రజాస్వామ్యా నికి విఘాతమే. ఒక పక్క ప్రతిపక్ష పార్టీలపై ఐటీ,ఈడీ దాడులు, అవినీతి బూచి చూపుతూ ప్రతిపక్ష ముఖ్యమంత్రులను జైలులో పెట్టడం.. అధికార కూటమి, ఎన్నికల ప్రాథమిక ప్రణాళికను మార్చడం సిగ్గుచేటు.

ప్రతిపక్ష ఇండియా కూటమిలో కీలక పార్టీ ఆప్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్, మరో ముఖ్యమంత్రి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్, ప్రతిపక్ష కూటమికి పెద్ద దెబ్బ. భారత ఎన్నికల కమిషన్ వద్ద నమోదైన రాజకీయ పార్టీలు వార్షిక ఆదాయ వ్యయాలకు సంబంధించి రిటర్నులు దాఖలు చేయాల్సి ఉన్నా, ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 13 ఎ కింద ఆదాయపు పన్ను చెల్లించడం నుండి మినహాయింపు ఉంది. అయినా కాంగ్రెస్ కు లెక్కల్లో చూపని ఆదాయం వచ్చిందనే సాకుతో.. లోక్ సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 బ్యాంక్ ఖాతాలను ఆదాయపన్నుశాఖ స్తంభింపజేసింది. 1990 నాటి టాక్స్ , పెనాల్టీ డిమాండ్ కు సంబంధించి ఈ ఖాతాలు స్తంభింపజేయడం మరో షాకింగ్ న్యూస్. ఏడేళ్ల క్రితం మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎలక్టోరల్ బాండ్ల వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందిన పార్టీ బీజేపీ కావడంతో.. ఈ గందర గోళం నుంచి దృష్టి మరల్చేందుకే .. బీజేపీ సర్కార్ ప్రతిపక్షాలను , ముఖ్యంగా కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తోం దనే విమర్శలు ఉన్నాయి. 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు.. మోదీ “కాంగ్రెస్ ముక్త్ భారత్ ” అని ఎలుగె త్తారు. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా రాణించకపోయినా 2024 నాటికి కాంగ్రెస్ మరింత బలపడింది. ప్రతిపక్షాలను ఏకతాటిపై తెచ్చి ఇండియాకూటమి ఏర్పాటులో కీలకపాత్రవహిం చడమే కాక, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన భారత్ జోడో రెండు యాత్రల కారణంగా జనసామాన్యం లో కాంగ్రెస్ బలమైన శక్తిగా తయారైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకే మోదీ సర్కార్ విశ్వప్రయత్నాలు చేస్తున్నది.

రానున్న పార్లమెంటు ఎన్నికలు న్యాయంగా, పారదర్శికంగా జరగాలంటే.. స్తంభింపజేసిన కాంగ్రెస్ అకౌంట్లు అన్నింటినీ పునరుద్ధరించాలి. ఆదాయపు పన్నుశాఖ తక్షణం తన దాడులను నిలిపి వేయాలి, అరెస్ట్ చేసిన ఢిల్లీ సీఎం, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ లను విడుదల చేయాలి. ప్రతిపక్షాలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులను సారస్వత ఎన్నికలు ముగిసేవరకూ నిలిపివేయాలి. ఈ వీఎంల విషయం లో ప్రతిపక్షాల డిమాండ్ అను సిఈసీ అమోదించాలి. కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పూర్తిగా స్వస్తి చెప్పాలి. అప్పుడే.. దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం ఉందని అంతర్జాతీయ దేశాలు గుర్తిస్తాయి. ప్రజాస్వామిక వాదులూ సంతోషిస్తారు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్