విమాన ప్రమాదంలో హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ మృతి చెందారు. ఆయనతో పాటు ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయారు. వారు ప్రయాణిస్తోన్న చిన్నపాటి విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కరీబియన్ సముద్రంలో కూలిపోయింది. తీర రక్షక దళం ఘటనా స్థలం నుంచి వీరి ముగ్గురితోపాటు పైలట్ మృతదేహాన్ని వెలికితీసింది. జర్మనీలో జన్మించిన క్రిస్టియన్ ఒలివర్ వయస్సు 51 సంవత్సరాలు. ఇద్దరు కుమార్తెలు అన్నిక్, మదితాతో కలిసి ఆయన ప్రైవేటు విమానంలో బెక్వియా నుంచి సెయింట్ లూసియాకు వెళ్తోన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ఒలివర్.. హాలీవుడ్‌తో పాటు జర్మనీలో పలు టీవీ సిరీస్‌ల్లో నటించారు. కోబ్రా 11 సిరీస్‌తో మంచి పేరు సొంతం చేసుకున్నారు. ‘ది గుడ్ జర్మన్’, ‘స్పీడ్ రేసర్’ సహా మొత్తం 60 సినిమాల్లో ప్రేక్షకులను అలరించారు.