సైబర్ నేరాలు కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలంగాణ డీజీపీ రవిగుప్తా అన్నారు. కొరియర్ నేరాలు క్రమంగా పెరుగుతున్నాయని తెలిపారు. ప్రజల్లో ముందుగా భయాన్ని నింపి సైబర్ నేరగాళ్లు చోరీ చేస్తున్నారని అన్నారు. యుట్యూబ్ వీడియోలకు లైక్ చేయడం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు. సైబర్ నేరాలపై అవగాహన ముఖ్యం అని డీజీపీ రవిగుప్తా స్పష్టం చేశారు. సైబర్ నేరాల కట్టడికి సైబర్ క్రైమ్ బ్యూరో ఎంతో కృషి చేస్తోందని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతిరోజు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చాలా సైబర్ నేరాలు నమోదు అవుతున్నాయన్నారు. నేరాలు జరిగినప్పుడు స్పందించడం కంటే ముందుగానే అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు


