26.2 C
Hyderabad
Wednesday, March 18, 2026
spot_img

ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా

       బీహార్ లో రాజకీయ చిత్రం గంటగంటకూ మలుపు తిరుగుతోంది. బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ చీఫ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం నితీశ్ కుమార్ రాజ్ భవన్ కు వెళ్లి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు.

       గవర్నర్ ను కలిసి తాను రాజీనామా సమర్పించినట్లు నితీశ్ కుమార్ మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దుచేయవలసిందిగా గవర్నర్ కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. నితీశ్ కుమార్ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో చేరేం దుకు సిద్ధమయ్యారు. మరో పక్క బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీజేపీ నాయకత్వం సమావేశం ఏర్పాటు చేసింది. నితీశ్ కుమార్ ఎన్డీఏలో చేరినట్లు అధికారికంగా ప్రకటించిన తర్వాత.. బీజేపీ- జేడీయూ ఉమ్మడి లెజిస్లేచర్ పార్టీ సమా వేశం ఆయనను నాయకుడిగా ఎన్నుకుంటారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్ రాజధాని పట్నా వస్తున్నారు. వారి సమక్షంలోనే నితీశ్ కుమార్ ఎన్డీఏకు జై కొట్టవచ్చు.

      ఆ తర్వాత బీజేపీ- జేడీఎస్ కూటమి నాయకుడిగా తాను ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు చేయవచ్చు. సాయంత్రానికల్లా ఈ పరిణామాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 2017లో ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమితో జేడీయూ కలవడంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నితీశ్ కుమార్, ఆర్జేడీకి చెందిన తేజస్వీ యాదవ్ ను డిప్యూటీ సీఎం చేశారు. కేవలం 18 నెలల్లోనే ఆర్జేడీ – జేడీయూ ఘట్ బంధన్ ముక్కలైపోతోంది. నితీశ్ కుమార్ జేడీ యూ మళ్లీ బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేలో చేరడం ఇండియా కూటమికి చావుదెబ్బే. తనను కూటమి కన్వీనర్ చేయ నందుకు నితీశ్ కుమార్ కూటమికి గట్టి దెబ్బే తీశారని భావించవచ్చు. నితీశ్ కుమార్ బీహార్ లో సుదీర్ఘ కాలంపాటు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గా పేరు గడించారు. 2005 నుంచి వివిధ పార్టీలతో జతకట్టి అత్యధికంగా తొమ్మిది సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. దాదాపు 18 ఏళ్లలో ఆయన బీజేపీతోనూ, ఆర్జేడీ- కాంగ్రెస్, వామప క్షాలతో జతకట్టడం ద్వారా అధికారంలో కొనసాగారు. ఇప్పుడు ఎన్డీ ఏలో చేరి, మరోసారి బీజేపీ- జేడీయూ కూట మి చీఫ్ గా సీఎం గద్దె ఎక్కుతున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్