ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో మున్సిపల్ శాఖ మం ఆదిమూలపు సురేష్, పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా కొండేపి నియోజక వర్గంలో నెలకొన్న వర్గపోరు గురించి చర్చించారు. మంత్రి సురేష్ ను ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి కొండేపి నియోజకవర్గం కు ఇన్చార్జిగా నియ మించగా… ఇప్పటికీ అక్కడ సురేష్ పలు సమావేశాలను ఏర్పాటు చేశారు. అయితే కొండేపి నియోజక వర్గంలో గత పది సంవత్సరాలుగా కొనసాగుతున్న వర్గ పోరు గాడిన పడలేదు. దీంతో దానిని సరి చేసేందుకు బాలినేని నివాసంలో ఈరోజు ముగ్గురు ప్రత్యేక సమావేశం అయ్యారు. నియోజకవర్గం లోని తాజా పరిస్థితుల పై చర్చించుకుని , అనంతరం కొండేపి నియోజకవర్గానికి బయలుదేరారు. కొండేపి నియోజకవర్గంలోని సింగరాయ కొండలో ఈ ముగ్గురు పలు వైసిపి నేతలు ద్వితీయశ్రేణి కార్యకర్తలతో సమావేశం కానున్నారు.