హైదరాబాద్ ఎల్బీనగర్ పాపన్నగూడ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.బైకు-టిప్పర్ ఢీ కొన్న ఘటనలో తండ్రీ కుమారుడు మృతి చెందారు. మృతులను అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన కుమార్ , ప్రదీప్‌గా గుర్తించారు. బైకును టిప్పర్ ఢీ కొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో టిప్పర్, బైకు దగ్ధమయ్యాయి. టిప్పర్ పాక్షికంగా దెబ్బతింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు చెప్పారు.