28.2 C
Hyderabad
Sunday, March 15, 2026
spot_img

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో పులి కలకలం

       ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దేవినేనివారి గూడెంలో పెద్దపులి సంచారం హడాలెత్తిస్తోంది. అర్ధరాత్రి సమయంలో గ్రామంలోని రెండు ఆవులు, ఒక దూడపై పులి దాడి చేసింది. తెల్లవారుజామున పొలంలోకి వెళ్లిన రైతులు గాయపడిన ఆవులను చూసి పులి దాడి జరిగినట్టుగా గుర్తించారు. ఘటనా స్థలంలో పులి పాదముద్రలు గుర్తించారు. దెందులూరు, ద్వారకాతిరుమల, నల్లజర్ల మండలాల్లో పులి ఎక్కువగా సంచరిస్తుంది. పులి కదలికలను గుర్తించేందు కు ఇప్పటికే అటవీశాఖ అధికారులు ఆరు బృందాలుగా గాలిస్తున్నారు. రోజుకు 40 కిలోమీటర్ల పరిధిలో పులి సంచారం కొనసాగడంతో బోను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. పులి సంచారంతో స్థానిక ప్రజల్లో భయాందోళన నెలకొంది. పొలాలకు వెళ్లాలంటే రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పులిని త్వరగా బంధిం చాలని అధికారులను కోరుతున్నారు. వారం రోజులుగా బుట్టాయిగూడెం, నల్లజర్ల, ద్వారకాతిరుమల, దెందులూరు మండలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న దెందులూరు మండలం మేదినరావుపాలెంలో పులి పాద ముద్రలను రైతులు గుర్తించారు. రైతులు వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. పాదముద్ర ఆధారం గా పెద్దపులి సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు.

         ఒక్కోచోట ఒక్కోరకంగా పాదముద్రలు ఉండడంతో… సంచరించేది ఒక్కటేనా లేక రెండా అనే అనుమానం కలుగు తోంది. పోలవరం కుడికాలువ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి ఎక్కువగా సంచరిస్తున్నట్లు తెలిసింది. గడిచిన వారం రోజు ల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో పులి సంచరిస్తోంది. ఇప్పటికే పెద్దపులి జాడ తెలుసుకునేందుకు ఆరు బృందా లుగా ఏర్పడి అటవీ శాఖ సిబ్బంది గాలిస్తున్నారు. పులి సమాచారం కోసం అటవీ సిబ్బంది టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల పాక దగ్గర వెలుతు రు ఎక్కువ వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్