స్వతంత్ర వెబ్ డెస్క్: ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భూమి కంపించింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉదయం 10.19 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూమికి 37 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర కేంద్రీకృతం అయింది. ఈ భూకంపం ప్రభావం జమ్మూ కాశ్మీర్, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో కూడా కనిపించింది. శ్రీనగర్, పూంచ్ ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదు అయ్యాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, పెషావర్, లాహోర్, ఇతర నగరాల్లో 6.3 తీవ్రతతో భూకంపం వచ్చిందని అక్కడి సోషల్ మీడియా వెల్లడించింది. అయితే, భూకంపం నష్టం గురించి ఇంకా తెలియరాలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.