తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జయహో బీసీ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ…టీడీపీ పాలనలో బీసీలకు ఎంత మేలు జరిగిందో వివరించారు. వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో బీసీలు ఎంతమేరకు కోల్పోయారో జయహో బీసీ సదస్సులో స్పష్టం చేశారు. జయహో బీసీ సదస్సు కోసం దాదాపు 40 రోజుల కార్యాచరణ రూపొందించారు జయహో బీసీ లక్ష్యాలను పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామరని చంద్రబాబు చెప్పారు.