ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి హవా బలంగా వీచింది. దీంతో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. అయితే, టీడీపీ కూటమి హవాలో ఇప్పటివరకు ఏపీ మంత్రులుగా ఉన్న వారు ఒక్కరు మినహా అంతా ఓటమి పాలుకావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సరికొత్త సంచలనాలకు నాంది పలికాయి. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి హవా బలంగా వీయడంతో వైసీపీ దారుణంగా పరాజయం పాలైంది. ఈ క్రమంలోనే పలువురు హేమాహేమీల్లాంటి నేతలు ఓటమి పాలయ్యారు. ప్రధానంగా ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వంలో మంత్రు లుగా పనిచేసిన వారిలో ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మిగిలిన వారంతా ఓటమి పాలయ్యా రంటే టీడీపీ కూటమిని ప్రజలు ఏ స్థాయిలో గెలిపించారో అర్థం చేసుకోవచ్చు.ఓటమి పాలైన మంత్రుల విషయానికి వస్తే.. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు ఓటమిపాల య్యారు. పలాస నుంచి బరిలో దిగిన సీదిరి అప్పలరాజు, సాలూరు నుంచి పోటీ చేసిన పీడిక రాజన్నదొర, చీపురుపల్లి నుంచి అదృష్టం పరీక్షించుకున్న బొత్స సత్యనారాయణ పరాజయం పాలయ్యారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన మరికొందరు మంత్రుల విషయానికి వస్తే, గుడివాడ అమర్‌నాథ్, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, తానేటి వనిత, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వర్ రావు, జోగి రమేష్, అంబటి రాంబాబు, విడుదల రజినీ, ఆదిమూలపు సురేష్, రోజా, కాకాణి గోవర్థన్ రెడ్డి, అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కే.వి ఉషశ్రీ చరణ్, పినిపే విశ్వరూప్, మేరుగు నాగార్జున, కె. నారాయణ స్వామి ఓటమి మూటగట్టుకున్నారు.


