ఏపీలో మద్యం షాపుల లాటరీ వ్యవహారంపై విమర్శలు గుప్పించారు…ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వై.ఎస్ షర్మిల. మద్యం సిండికేట్లను అరికట్టడంలో సీఎం చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తున్నారంటూ ఆరోపించారు. ఎక్కడికక్కడ అధికార పార్టీ నాయకులు సిండికేట్లుగా ఏర్పడి వైన్ షాపులను దక్కించుకున్నారని తెలిసిందంటూ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు షర్మిల.
కూటమి సిండికేట్లకే 3 వేలకు పైగా మెజార్టీ షాపులు దక్కాయంటే ప్రభుత్వ పారదర్శకత, నిస్పాక్షికత ఎంత గొప్పగా ఉందో అర్థమవుతోందని ట్వీట్ చేశారు షర్మిల. సాధారణ ప్రజలకు షాపులు దక్కకుండా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే కనుసన్నల్లోనే వ్యవహారం అంతా సాగిందని, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల.