35.2 C
Hyderabad
Saturday, May 10, 2025
spot_img

YS Sharmila: చిన్నదొరా.. ఓట్ల కోసమే కదా ఈ డ్రామాలన్నీ: వైఎస్ షర్మిల

స్వతంత్ర వెబ్ డెస్క్: నిన్నటి వరకు టీఎస్‌పీఎస్సీ పారదర్శకంగా పని చేస్తోందన్న కేటీఆర్ ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ప్రక్షాళన అంటున్నారని, అంటే చిన్నదొర తప్పు అంగీకరించినట్లే కదా? అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆమె సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా తెలంగాణ మంత్రిపై విమర్శలు గుప్పించారు. ఓట్ల కోసం కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమన్నారు. నాడు పేపర్లు లీకై నిరుద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నప్పుడు టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పని చేస్తోందని చెప్పారని, ఇప్పుడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంటున్నారని విమర్శించారు. అంటే చిన్న దొర తప్పు ఒప్పుకున్నట్టే కదా? అన్నారు. ఉద్యోగాలు ఇవ్వమని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు మాట్లాడలేదని, కానీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తామని బొంకుతున్నాడన్నారు.

బోర్డు పారదర్శకంగా నడుస్తుందని ప్రకటించిన మీరే… పరీక్షల నిర్వహణలో లోపాలు జరగలేదన్నది మీరే… ఇప్పుడు తప్పు జరిగిందని సర్వీస్ కమిషన్ ప్రక్షాళన అంటున్నది మీరేనని కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డ్రామాలన్నీ ఎందుకు దొర? ఓట్ల కోసమే కదా! ఇన్ని రోజులు టీఎస్పీఎస్సీలో జరిగిన అవకతవకలు నిజం… మీరు పరీక్ష పేపర్లు అమ్ముకున్నారన్నదే వాస్తవం… ఏళ్ల తరబడి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడి ఇప్పుడు నిరుద్యోగులపై ప్రేమ కురిపిస్తున్నారన్నారు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని తెలంగాణ బిడ్డలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల బలిదానాల మీద అధికార పీఠం ఎక్కి నిరుద్యోగులనే నిండా ముంచిన దుర్మార్గులు మీరు.. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ మీరు చేసిన మోసాలు చాలు.. ఈ నిరుద్యోగుల ఆగ్రహజ్వాలల్లోనే మీ ప్రభుత్వం మంట కలిసిపోతుందని శాపనార్థాలు పెట్టారు. మీరు తెలంగాణ చరిత్రలో నిరుద్యోగ ద్రోహులుగా నిలిచిపోతారన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్