వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి లండన్ పర్యటనకు వెళ్లారు. తన రెండో కుమార్తె వర్షారెడ్డి కాన్వకేషన్ సందర్భంగా జగన్ దంపతులు హాజరుకానున్నారు. జగన్ రెండో కుమార్తె వర్షారెడ్డి ప్రపంచప్రఖ్యాత కింగ్స్ కాలేజీ లండన్‌లో ఎంఎస్, ఫైనాన్స్ కోర్సును పూర్తిచేశారు. చక్కటి ప్రతిభతో డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులయ్యారు. రేపు లండన్‌లోని కింగ్స్ కాలేజ్ పట్టా ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో జగన్ దంపతులు పాల్గోనున్నారు. ఈ నెలాఖరున జగన్ లండన్ నుంచి తిరిగి పయనమవుతారు.
జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ మంజూరు అయిన సమయంలో కోర్టు ఆయనకు షరతులు విధించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లారాదనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్ విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. తన కుమార్తె గ్రాడ్యుయేషన్ డే కోసం లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు జగన్. దీంతో సీబీఐ కోర్టు ఆయన విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.