స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏపీ మాజీ మంత్రి వై ఎస్ వివేకా హత్య కేసులోప్రధాన నిందితుడుగా ఉన్న వైయస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గత కొంతకాలంగా చంచల్ గూడా జైల్లో జ్యుడిషియల్ రీమాండ్ గా ఉన్న భాస్కర్ రెడ్డి.. తన ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. దీంతో స్పందించిన కోర్టు.. భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ చేపడుతామని తెలిపింది.


