29 C
Hyderabad
Monday, September 29, 2025
spot_img

‘టైగర్-3’ నుంచి సెకెండ్ సాంగ్ రిలీజ్

య‌ష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివ‌ర్శ్‌లో ఎప్పుడూ సీక్రెసీ మేజ‌ర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ప్రేక్ష‌కుల్లో అమితాస‌క్తిని క్రియేట్ చేయ‌డానికి ఎప్పుడూ సీక్రెసీని బిల్డ్ చేస్తుంటారు మేక‌ర్స్. ఇప్పుడు టైగ‌ర్‌3లోనూ ఆదిత్య చోప్రా అలాంటిదే ప్లాన్ చేశారు. టైగ‌ర్‌3లోని రెండో పాట ప్ర‌తి క‌ణం క‌ణంలో ఉన్న మేజ‌ర్ ప్లాట్ పాయింట్‌ని సినిమాలో చూసి తీరాల్సిందేన‌ని అంటున్నారు ఆదిత్య చోప్రా.

ఈ పాట‌ గురించి డైర‌క్ట‌ర్ మ‌నీష్ శ‌ర్మ మాట్లాడుతూ “టైగ‌ర్‌, జోయా మ‌ధ్య ఈ సినిమాలో అత్య‌ద్భుత‌మైన జ‌ర్నీ ఉంటుంది. వారిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు మ‌రింత అన్యోన్యంగా అనిపిస్తాయి. ప్ర‌తి క‌ణం క‌ణం అందుకు చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌. ఈ పాట‌ను చాలా బాగా చిత్రీక‌రించాం. ఇందులోని దృశ్యాల‌ను, ఇలాంటి మ‌రికొన్ని కీల‌క అంశాల‌ను ప్రేక్ష‌కులు వెండితెర‌మీద అనుభూతి చెందాలి. ఆ క్ష‌ణాల్లో వారి ఆనందాన్ని మేం చూడాలి“ అని అన్నారు.

వీడియో సాంగ్‌ని హోల్డ్ చేయ‌డం గురించి చెబుతూ “చాలా సోల్‌ఫుల్ సాంగ్ ఇది. స‌ల్మాన్‌ఖాన్ మీద తెర‌కెక్కించిన ఇంత గొప్ప పాట‌ను ప్రేక్ష‌కుల‌కు రుచి చూప‌కుండా ఆప‌డం మాక్కూడా బాధ‌గానే ఉంది. కానీ కొన్నిసార్లు త‌ప్ప‌దు. ఎందుకంటే, వెండితెర మీద ఈ పాట‌ను చూసిన‌ప్పుడు, మేం ఎందుక‌లా చేయాల్సి వ‌చ్చిందో ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కుండా అర్థ‌మ‌వుతుంది. ఆడియ‌న్స్‌కి ఆ ఎగ్జ‌యిట్‌మెంట్ అందించ‌డానికే ప్ర‌స్తుతం మేం ఈ ప‌ని చేస్తున్నాం“ అని అన్నారు.
స‌ల్మాన్‌ఖాన్‌, క‌త్రినా కైఫ్ న‌టించిన సినిమా టైగ‌ర్‌3. టైగ‌ర్‌, జోయా పాత్ర‌ల్లో త్రీక్వెల్‌లో అల‌రించ‌డానికి రెడీ అవుతున్నారు ఈ జంట‌. య‌ష్‌రాజ్‌ఫిల్మ్స్ స్పై యూనివ‌ర్శ్‌లో సినిమాటిక్ టైమ్‌లైన్‌లో విడుద‌ల‌వుతున్న ఐదో సినిమా ఇది. ఏక్‌తా టైగ‌ర్‌, టైగ‌ర్ జిందా హై, వార్‌, ప‌ఠాన్ సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్