ఓ వైపు యాడ్స్ లో నటిస్తూ.. మరో వైపు సినిమాల్లో నటిస్తున్న యంగ్ టాలెంటెడ్ బ్యూటీ పూర్ణిక శాన్వి(POORNIKA SAANVE). ఇప్పటి వరకు 20 యాడ్స్‌లో నటించింది. అలాగే పలు చిత్రాల్లోనూ నటించింది. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, కింగ్ నాగార్జున బంగార్రాజు, నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్, సమంత యశోద తదితర చిత్రాల్లో పూర్ణిక శాన్వి నటించింది.
ఈ అందాల ముద్దుగుమ్మ ప్రస్తుతం కొన్ని భారీ, క్రేజీ చిత్రాల్లోనూ నటిస్తోంది. పర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ వస్తే.. తనేంటో నిరూపించుకుంటాను అంటోంది. నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకోవాలి.. నటిగా ఎప్పటికీ గుర్తుండే పాత్రలు చేయాలి అనేదే పూర్ణిక శాన్వి లక్ష్యం. మరి.. కొత్త సంవత్సరంలో మరిన్ని మంచి పాత్రలతో అలరిస్తుందేమో చూడాలి.