YCP | ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం సృష్టించేందుకు జగన్ సర్కారు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జగన్ ప్రభుత్వం. ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పటిష్టతను పెంచేందుకు ఎల్లుండి నుంచి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం చేపట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఏకకాలంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంబించనున్నారు. ఈ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 7 లక్షల మంది పార్టీ గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు భాగస్వామ్యం కానున్నారు. రాష్ట్రంలోని నియోజకవర్గ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌ల నేతృత్వంలో ఈ కార్యక్రమం సాగనుంది.
Read Also: భువనగిరిలో కోర్టుకు…బండి సంజయ్?
Follow us on: Youtube, Instagram, Google News