గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడు తూ సోఫాలోనే ఒక్కసారిగా కొడాలి కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన నేతలు, గన్‌మెన్లు వైద్యులకు సమాచారం అందించారు. వెంటనే ఇంట్లో ఉన్న కార్యకర్తలు, నేతలను గన్‌మెన్లు బయటికి పంపించేశారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం కొడాలి నానికి వైద్యులు సెలైన్లు ఎక్కిస్తున్నారు. నాని, అతిగా ఆలోచించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, తగు జాగ్రత్తలు తీసుకోవా లని కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు.


