తన కూతురు క్రాంతి వ్యాఖ్యలపై వైసీపీ నేత ముద్రగడ స్పందించారు. కొందరు వ్యక్తులు తన కూతురితో తిట్టించారని అన్నారు. ఇది చాలా బాధాకరం అని చెప్పారు. కూతురుకు పెళ్లి అయిపోయిందని, ఇప్పుడు మెట్టినిల్లే ఆమె ప్రాపర్టీ అని తెలిపారు. రాజకీయం రాజకీయమే.. కూతురు కూతురే అని స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కేవలం పదవి కోసమే పిఠాపురం వస్తున్నారని వైసీపీ నేత ముద్రగడ పద్మ నాభం అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అధికారమనే ఆకలి తీర్చుకోవాలనే తాపత్రయం మాత్రమే ఉందని మండిపడ్డారు. పిఠాపురంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను కలిశారు. ఈ సందర్బంగా ముద్రగడ చంద్రబాబు, పవన్ లపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు మాటలను, హామీలను నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇక, పవన్ హైదరాబాద్‌కే పరిమితమయ్యే వ్యక్తి అంటూ ఫైర్ అయ్యారు. ముఖానికి రంగులు వేసుకుని పవన్ వస్తున్నాడని విమర్శించారు.


