అసెంబ్లీ సమావేశాల వేళ ఏపీలో పొలిటికల్ దుమారం రేగుతోంది. ఇవాళ్టి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది వైసీపీ పార్టీ. సభలో మాట్లాడే అవకాశం ఉండదన్న కారణంతో సెషన్స్‌ను బహిష్కరించింది. గత సమావేశాల్లో మైకు ఇవ్వకపోవడంతో.. నిరసన తెలపుతూ ఈసారి జరిగే సమావేశాలను బహిష్కరించింది వైసీపీ. మరోపక్క తాము 40 శాతం ఓట్ షేర్ సాధించినందును ప్రతిపక్ష హోదా కల్పించాలని పట్టుబట్టారు జగన్. దీనికి స్పీకర్ అంగీకరించనందున సభకు హాజరుకాకూడదని నిర్ణయం తీసుకున్నారు. అయితే,.. సమావేశాలకు దూరంగా ఉన్నప్పటికీ అసెంబ్లీ జరిగినన్న రోజులు మీడియా ద్వారా ప్రశ్నలు సంధిస్తూనే ఉంటానన్నారు జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు.