స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి సన్నిధానానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో యాదాద్రి చుట్టుపక్కల జిల్లాలతో పాటుగా హైదరాబాద్ నగరం నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. పార్కింగ్, కోనేరు, గుట్ట దిగువన భక్తులతో నిండిపోయింది. ప్రస్తుతం యాదాద్రీశురుని ఉచిత దర్శనానికి దాదాపు మూడు గంటలు సమయం.. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. లడ్డు ప్రసాదం కౌంటర్లు, నిత్యా కళ్యాణం, కొండ కింద కల్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.


