విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 9 మంది చనిపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాం గం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలని కోరారు. కలుషిత నీటితో ప్రజల ప్రాణా లు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపో యారని అధికారులు చెప్పడం సరికాదన్నారు. కలుషిత నీటి గురించి ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల పై అధికారులు స్పందించాలని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చంద్ర బాబు డిమాండ్ చేశారు.


