స్వతంత్ర వెబ్ డెస్క్: వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఇక ఇప్పటికే మూడు మ్యాచ్ లో విజయం సాధించిన టీమిండియా ఇవాళ బంగ్లాదేశ్ జట్టుపై కూడా గెలవాలని ఆత్రుతగా ఉంది. ఈ మ్యాచ్ లో మొదటి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి.
జట్ల వివరాలు
ఇండియా ఎలెవన్: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
బంగ్లాదేశ్ XI: లిట్టన్ దాస్, తాంజిద్ తమీమ్, మెహిదీ హసన్ మిరాజ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్* (c), ముషిఫికర్ రహీమ్ (wk), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం