స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: సాధారణంగా వందలు, వేలు, లక్షలు దొంగతనం చేయడం చూసుంటాం. కోట్లు కూడా సైబర్ నేరగాళ్లు కొట్టేస్తున్నారు. కానీ ఓ మహిళ కోడికూర పెట్టి కోట్లు కాజేసింది. ఇదేంటని షాక్ అయ్యారా.. అవును నిజమే.. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని రామనాథపురంలో రియల్టర్ రాజేశ్వరితో వర్షిణి అనే మహిళా పరిచయం పెంచుకుంది. భూములు కొనేందుకు కస్టమర్స్ ఉన్నారంటూ వర్షిణి స్నేహితులను తీసుకొచ్చింది. ఇలా ఒక సమయంలో కోడికూరను ప్రేమగా వండినట్లు నటించి అందులో మత్తుమందు కలిపింది. తీరా ఫుల్లుగా భోజనం చేశాక రియల్టర్ రాజేశ్వరి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఇంట్లో ఉన్న నగదు, బంగారంతో ఉడాయించింది వర్షిణి.