స్వతంత్ర వెబ్ డెస్క్: లోక్సభలో రాహుల్ గాంధీ (Rahul Gandhi)ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. జోడో యాత్రకు (Jodo Yatra) ముందు తనలో అహంకారం ఉండేదని.. ఇప్పుడు నాలో అహంకారం లేదని రాహుల్ అన్నారు. అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో చర్చ సాగుతుండగా.. కాంగ్రెస్ పార్టీ (Congress Party) తరపున మాట్లాడిన రాహుల్ గాంధీ.. బీజేపీ సభ్యులకు సెటైర్లు వేస్తూ.. జోడో యాత్ర తర్వాత తనలో వచ్చిన మార్పును సభకు వివరించారు. గతంలో అదాని గురించి మాట్లాడినప్పుడు ఓ పెద్ద మనిషికి ఇబ్బంది కలిగించిందేమో.. నేడు అదానీ గురించి నేనేమీ మాట్లాడను.. భయపడాల్సిన పనిలేదని రాహుల్ అన్నారు. నాది రాజకీయ ప్రసంగం కాదు.. కన్యా కుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు.. జోడో యాత్రలో ప్రజల సమస్యలను దగ్గరనుంచి చూశాను. జోడో యాత్ర ముందుకు నాకు అహంకారం ఉండేది.. జోడో యాత్రతో నా అహంకారం కొద్దికొద్దిగా మాయమైపోయింది. పాదయాత్ర ఇంకా ముగియలేదు.. లద్దాఖ్ వరకు పాదయాత్ర చేస్తానని రాహుల్ స్పష్టం చేశారు.


