31 C
Hyderabad
Friday, July 11, 2025
spot_img

Minister KTR: నిజామాబాద్‌ లో ఐటీ టవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

స్వతంత్ర వెబ్ డెస్క్: నిజామాబాద్‌ ఐటీ టవర్‌ను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ (KTR) ప్రారంభించారు. దీనితో పాటు న్యాక్‌ కేంద్రాన్ని(Nac) ప్రారంభించారు. అనంతరం ఐటీ హబ్‌ను(IT Hub) పరిశీలించారు. కొత్తగా రిక్రూట్‌ అయిన ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు. రూ.50 కోట్లతో మొత్తం 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆకట్టుకునే రీతిలో ఈ ఐటీ టవర్‌ను నిర్మించారు. ప్రభుత్వపరంగా టీఎస్‌ఐఐసీ ద్వారా మౌలిక వసతులు, అత్యాధునిక సౌకర్యాలను కల్పించింది.

ఐటీ సంస్థలను నెలకొల్పబోయే వారంతా ఐటీ శాఖతో (IT Department) ఒప్పందాలను కుదుర్చుకున్నది. ఐటీ కంపెనీల్లో ఉద్యోగ నియామక ప్రక్రియను టాస్క్‌ ఆధ్వర్యంలో జూలై 21న నిర్వహించింది. వేలాది మంది తరలిరాగా అందులో నైపుణ్యం కలిగిన వారిని ఐటీ కంపెనీలు రిక్రూట్‌ చేసుకుంటున్నాయి. మొత్తం 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాన్ని ఆకట్టుకునే రీతిలో చేపట్టారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌తో కలుపుకొని మూడు అంతస్థులతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఎకరం భూమిలో ఐటీ టవర్‌ను డిజైన్‌ చేశారు. మిగిలిన 2.5 ఎకరాల భూమిని భవిష్యత్తులో ఐటీ టవర్‌ను విస్తరించాలనుకున్న సమయంలో ఎలాంటి స్థలాల కొరత లేకుండా ఉండేందుకు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారు.
 మరోవైపు చదువుతో సంబంధం లేకుండా స్వయం ఉపాధిపై ఆసక్తి ఉన్న వారందరికీ ఎన్‌ఏసీ (NAC) కేంద్రంగా నిలువనుంది. మేసన్‌ జనరల్‌, అసిస్టెంట్‌ బార్‌ బెండర్‌ అండ్‌ స్టీల్‌ ఫిక్చర్‌, షట్టరింగ్‌ కార్పెంటరీ, కన్‌స్ట్రక్షన్‌ పెయింటర్‌ అండ్‌ డెకొరేటర్‌, అసిస్టెంట్‌ టెక్నీషియన్‌ డ్రై వాల్‌ అండ్‌ ఫాల్స్‌ – సీలింగ్‌, అసిస్టెంట్‌ ఎలక్ట్రిషన్‌, ప్లంబర్‌(జనరల్‌), అసిస్టెంట్‌ సర్వేయర్‌, అసిస్టెంట్‌ వర్క్‌ సూపర్‌వైజర్‌, ఆర్క్‌ అండ్‌ గ్యాస్‌ వెల్డర్‌, అసిస్టెంట్‌ స్టోర్‌ కీపర్‌ అండ్‌ స్టోర్‌ కీపర్‌, సూపర్‌వైజర్‌ స్ట్రక్చర్‌, టైలరింగ్‌ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్