Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

ఏపీలో సంక్షేమ పథకాలు ఆగిపోతాయా ?

   వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు సంబం ధించి ఒక కొత్త ఒరవడి సృష్టించింది. ఒకటా రెండా  బోలెడన్ని పథకాలకు రూపకల్పన చేసింది. పేదల సంక్షేమమే టార్గెట్ గా ముందుకు వెళుతోంది. ఖజానాకు ఖర్చయినా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. పేదవాళ్లకు మేలు చేయడమే తమ ప్రభుత్వ ఆశయమంటున్నారు జగన్మోహన్ రెడ్డి. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేపట్టనన్ని సంక్షేమ పథకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోంది. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

  జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలు అందిస్తోంది. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి ఒకటి. నవరత్నాల్లో భాగమే అమ్మఒడి పథకం. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా డబ్బులు జమ చేస్తుంది. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ చేస్తోంది.పేద కుటుంబంలోని పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలనే మంచి లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చారు.అమ్మ ఒడి పథకం అమలు పై రాష్ట్రవ్యాప్తంగా తల్లులంతా సంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ ఇచ్చే సొమ్ములతో తమ పిల్లల చదువును కొనసాగిస్తున్నామన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దవాళ్లు. అలాంటి ఆరోగ్యానికి టాప్ ప్రయారిటీ ఇస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. పేద, సామాన్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలకు ఖరీదైన రోగాలు వస్తే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చు పెట్టి చికిత్స చేయించుకోలేరు. ఇలాంటి వారికి వరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య మిత్ర పథకం.

  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైన ఆరోగ్య శ్రీ పథకానికి కొనసాగింపే ఇప్పటి ఆరోగ్య మిత్ర పథకం. ఆరోగ్య మిత్ర పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య బీమా పథకంగా గుర్తింపు పొందింది. ఈ పథకం కింద అర్హులైన పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలందిస్తారు. అంతేకాదు రవాణా, భోజన, వసతి సదుపాయాలు కూడా కల్పిస్తారు. ఈ పథకం కింద లక్షలాది మంది పేదవారికి ఉచితంగా ఆపరేషన్లు చేశారు. ఆరోగ్య మిత్ర పథకం కింద 1038 కి పైగా వివిధ రకాల వ్యాధులకు ఉచితంగా చికిత్స చేస్తారు. ముఖ్యంగా ఈ పథకాన్ని ప్రజారోగ్యమే లక్ష్యంగా పెట్టుకుని రూపొందించారు. ఈ పథకానికి సంబంధించిన కార్డులను ప్రభుత్వం పేదవారికి జారీ చేస్తుంది. ఈ కార్డుల ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి ఉచిత చికిత్స తీసుకోవచ్చు.

  ఆరోగ్యమే కాదు, మిగతా వాటిపై కూడా జగన్ సర్కార్ ఫోకస్ పెట్టింది. నవరత్నాల్లో భాగంగా అమలు చేస్తున్న మరో ముఖ్యమైన పథకం వైఎస్ ఆర్ వాహన మిత్ర. ఈ స్కీమ్ ద్వారా అర్హులకు ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. సొంత వాహనం ఉన్న ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు ఈ పథకంలో చేరడానికి అర్హులు. వాహనదారులను అన్ని విధాలుగా ఆదుకోవడమే వాహన మిత్ర పథకం ముఖ్యోద్దేశం. వెహికిల్స్ మెయింటెనెన్స్ కు ఈ పథకం టాప్ ప్రయారిటీ ఇస్తోంది. వాహనాల ఇన్సూరెన్స్, ఫిట్ నెస్, మరమ్మతుల కోసం సొమ్ములు కూడా లబ్దిదారు లకు అందచేస్తారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు మేలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయిం చుకున్నారు. వెంటనే రంగంలోకి దిగారు. రైతులను ఆదుకోవడానికి రైతు భరోసా పేరుతో ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్‌ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి ఏటా మూడు విడతల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ. 13,500 చొప్పున పెట్టుబడి సాయం అందచేస్తాయి. గత ప్రభుత్వ హయాం లో సామాన్య ప్రజలు రేషన్ తీసుకోవడానికి నానా ఇబ్బందులు పడేవాళ్లు . రేషన్ డీలర్ ఎప్పుడు షాపు తీస్తాడో ఎవరికీ తెలిసేది కాదు. దీంతో ప్రజలు ఒకటికి పదిసార్లు రేషన్ షాపు చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే జగన్ సర్కార్ వచ్చాక పరిస్థితి మారింది. రేషన్ ఇంటికే తీసుకొచ్చి ఇస్తున్నారు. షెడ్యూల్డ్ టైమ్ కు రేషన్ అందడంతో సామాన్య ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి సర్కార్ పుణ్యమేనన్నారు.

   ఏపీ ముఖ్యమంత్రి జగజన్మోహన్ రెడ్డి కొంతకాలం కిందట మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు పధకంలో అనేక నిర్ణయాలు అమలు చేస్తున్న ప్రభుత్వం పేదవారికి మేలు చేయడానికి మరో నిర్ణయం తీసుకుంది. ఈ పధకం కింద ఇంటి నిర్మాణం కోసం ఒక్కో ఇంటికి 90 బస్తాల సిమెంట్ ను అందచేస్తారు. అయితే ఇది సరిపోవడం లేదన్న మాట పేదవర్గాల నుంచి వినిపించింది. దీంతో జగన్మోహన్ రెడ్డి స్పందించారు. పేద వర్గాలకు రాయితీపై మరో 50 బస్తాలను అదనంగా ఇవ్వాలని, ఈ మొత్తాన్ని ఇంటి నిర్మాణ రాయితీ నుంచి మినహా యించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్న అనుమానాలు సామాన్య ప్రజల్లో కలుగుతున్నాయి. దీంతో ఆరునూరైనా తమ చీకటి బతుకుల్లో వెలుగులు నింపుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలని కోరుకుంటున్నారు. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి జై కొడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్