22.2 C
Hyderabad
Saturday, February 21, 2026
spot_img

ఈసారి లోక్ సభ ఎన్నికల్లో 2004 చరిత్రే రిపీట్ అవుతుందా?

  2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రచారం హోరెత్తి పోతోంది. “వికసిత్ భారత్” “ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్”.. “ఇస్ బార్ 400 పార్” అంటూ కాషాయసేన ఊదరగొట్టు ప్రచారం తీరు చూస్తే, 2004లో వాజపేయి ఆధ్వర్యంలో బీజేపీ ప్రచారాన్ని తలపిస్తోంది. “దేశం వెలిగిపోతోంది” “ఇండియా షైనింగ్ ” అంటూ ప్రచారం హోరెత్తించి అప్పటి సర్కార్ బొక్కబోర్లా పడింది. దిమ్మతిరిగే ఓటమి చవిచూసింది. మోదీఅండ్ కో ప్రచారం సరళిఅదే ధోరణిలో సాగుతోంది. మరో షాక్ తప్పదా. 2004 రిపీట్ అవుతుందా.?

భారత రాజకీయాల్లో ఏదైనా సంభవమే. బీజేపీ సర్కార్ అనుసరించిన హిందుత్వ అనుకూల విధానాలు, మత ప్రాతిపదికన ప్రజల్లో విభజన, భారత్ వెలిగిపోతోందన్న ప్రచారం 2004 లో చిత్తుగా ఓడింది. 2024 లో అది పునరావృతం అవుతుందా. అన్నది కోటి డాలర్ల ప్రశ్న. నరేంద్రమోదీ సర్కార్ కు ప్రపంచ దేశాలు బ్రహ్మరథం పట్టినా, దేశంలో కోట్లాది మంది మేధావులు మెచ్చుకుంటున్నా.. ఆల్ ఈజ్ నాట్ వెల్.. అన్నట్లే ఉంది. అయితే బీజేపీకి వ్యతిరేకత 2024లో ఘోర పరాజయం చవిచూసే స్థాయిలో ఉందా అంటే అనుమానమే. 2004 లో వాజపేయి ఓడిపోతారని ఎవ్వరూ భావించలేదు. అలాగే 2024 లో మోదీ బీజేపీ ఓడి పోతుందని ఎవరూ భావించడం లేదు. అయినా, భారత రాజకీయాల్లో అసం భవం. సంభవించిన సందర్భాలు లేకపోలేదు. 1977లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ.. ఓటమి పాలవు తారని ఎవరూ భావించలేదు. అయినా జనతా సర్కార్ అధికారం అందుకుంది. 1989లో రాజీవ్ గాంధీ సర్కార్ ఓటమి. ఊహించనిదే.

   మోదీ హయాంలో కోట్లాది మంది హిందువుల ఆకాంక్షల రూపంగా అయోధ్యలో రామ మందిరం సాకారమైంది. ఈ దెబ్బతో హిందూ ఓట్లు అన్ని గంపగుత్తగా బీజేపీ పరం అవుతుందన్న భావన మొదట్లో ఉన్నా, క్రమంగా వెలవెలబోయింది. ప్రధాని మోదీ సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అని ప్రచారం చేస్తున్నా, హిందూ – ముస్లింల సంబంధాల విషయంలో బీజేపీ వైఖరి భిన్నంగా కన్పిస్తోందని, ముస్లీం వ్యతిరేకత అడుగడుగునా వ్యక్తమవుతోందని రాజకీయ పరిశీలకులు, ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు. మోదీ .. తన ప్రతి మాటలోనూ, ప్రతి చేష్టల్లోనూ హిందుత్వ పట్ల పూర్తి విశ్వాసం ప్రకటిస్తూ మతవిశ్వాసాల పట్ల తన నిబద్ధత వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో ఇతర నాయకులు కూడా మైనారిటీ మతం పట్ల ప్రత్యక్షంగానే, పరోక్షంగానే విషం చిమ్ముతూనే ఉన్నారు.

ప్రతిపక్ష కాంగ్రెస్ ను హిందూ వ్యతిరేక పార్టీగా చిత్రీకరించేందుకు కమలదళం నిరంతరం కృషి చేస్తూనే ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లీంలీగ్ ముద్ర కన్పిస్తోందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే. దేశ సంపదను ముస్లీంలకు దోచి పెడుతుందని, హిందూ మహిళల మంగళసూత్రాన్ని కూడా తెంపి ముస్లింలకు దోచి పెడతారన్న మోదీ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యవాదులకు, లౌకిక వాదులకూ ఆశ్చర్యం కల్గించాయి. హిందువు ల అభ్యున్నతే తమ ధ్యేయం అని చెప్పుకోవడమే కాదు. ఇస్లామిస్టులు, ఇతర “జాతి వ్యతిరేక” శక్తుల దాడుల కారణంగా హిందూ మతం ప్రమాదంలో ఉందని సూచించడానికి హిందూ-ముస్లిం పోలరైజేషన్ను ఉపయోగించడం బీజేపీ ఎజెండా అయింది అలాగే, ముస్లీంలలో పస్మాండా ముస్లీం ఓటర్లను ఆకర్షిం చేందుకు 2020 నుంచి బీజేపీ ఓ వ్యూహంతో పనిచేస్తోంది. ఈ పరిణామాలను ప్రజా స్వామికవాదులు హర్షించడం లేదు.

పదేళ్లలో ఎన్నో ఘనవిజయాలు సాధించామని జెబ్బలు చరుచుకుంటూ ప్రచారం చేస్తున్నా, బీజేపీ శ్రేణుల్లో గుబులు లేకపోలేదు. పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఘనకార్యాలతో పాటు  చాలా కీలక నిర్ణయాలతో ప్రజాగ్రహాన్ని చవి చూసింది. బీజేపీ చేసిన వ్యవసాయ చట్టాల కారణంగా రైతాంగం మహోద్యమమే నడిపింది. ఫలితంగా మోదీ సర్కార్ దిగిరావల్సి వచ్చింది. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కచ్చితంగా వచ్చేలా ఎంఎస్ పీకి చట్టబద్ధత కల్పించాలన్న రైతుల డిమాండ్ ను పట్టించుకోకపోవడంతో రైతులు ఇప్పటికీ ఆగ్రహంతో ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వం సవరణ చట్టం.. కొన్ని వర్గాలను దూరం చేసింది. పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటిన నిత్యావసరవస్తువుల ధరలు, పెరిగిన నిరుద్యోగంతో యువతలో నిరాశ నిస్పృహలు ఓటింగ్ లో ప్రతిబింబిస్తే మోదీ సర్కార్ కు కష్టమే.

    2024 లోక్ సభ ఎన్నికల్లో ఏప్రిల్ 19న తొలివిడతలో 102 నియోజకవర్గాలకు, ఏప్రిల్ 26న మరో 88 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల పోలింగ్ సరళి పరిశీలిస్తే, బీజేపీకి ఎదురు గాలి బలంగా వీచిందనే సూచనలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇండియా ఐక్య కూటమి బలమైన పోటీ ఇస్తోంది. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు కాక రేపుతున్న ఎండల కారణంగా ఓటింగ్ శాతం తగ్గుతోంది. ఇవన్నీ.. బీజేపీ కి చేదు వార్తలే. ఇప్పటికే బీజేపీకి 400 ప్లస్ సాధించే సీన్ లేదని తేటతెల్లం అయింది. మరో ఐదు విడతల్లో లోక్ సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఫలితాలు అటుఇటు అయితే 2004 పునరావృతం కావచ్చునేమో.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్