24.2 C
Hyderabad
Thursday, October 23, 2025
spot_img

పొత్తుతో బీఆర్ఎస్ పార్టీకి లాభం జరిగేనా…?

    తెలంగాణలో మరో పొత్తు పొడిచింది. లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్, బీఎస్పీ పార్టీలు కలిసి బరిలో దిగనున్నాయి. పార్లమెంటు ఎన్నికల ముందు కుదిరిన ఈ రెండు పార్టీల కలయికతో గులాబీ పార్టీకి లాభం జరుగుతుందా…? బిఆర్ఎస్ ,బీఎస్పీ పార్టీల పొత్తు వెనుక వ్యూహం ఏంటి…?

   తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్, బీఎస్పీ రెండు పార్టీలు పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లుగా ఇరుపార్టీల నేతలు ప్రకటించారు. ఈ మేరకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు.

    ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో 39 అసెంబ్లీ స్థానాలు సాధించిన బిఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష స్థానానికి పరిమితం అయింది. అంతకు ముందు మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ సీపీఎం,సీపీఐ పార్టీలతో పొత్తు పెట్టుకుని విజయం సాధించింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలోను పొత్తు పెట్టుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. అటు వామపక్ష పార్టీలు సైతం బిఆర్ఎస్ పార్టీ తమకు ఒకటి లేదా రెండు స్థానాలు ఇస్తుందని భావించాయి. తీరా ఎన్నికల సమయంలో వామపక్షాలతో పొత్తు ఉండదని గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఒంటరిగా పోటీ చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారానికి దూరం అయింది. ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు ఐ.పి.ఎస్. అధికారిగా వున్న ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసి బీఎస్పీ పార్టీలో చేరారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ తరపున అభ్యర్థులను నిలబెట్టారు. స్వయంగా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కు 44,646 ఓట్లు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ పార్టీకి 1.4 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు.

       తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీపైన, ప్రభుత్వంపైన అనేక విమ ర్శలు చేశారు. ముఖ్యంగా టీఎస్పీఎస్సి పేపర్ లీకేజీ అంశాలపై బిఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు సంధించారు. బిఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత రావడానికి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తనవంతు పాత్రను పోషించారు. కానీ ఇప్పుడు గులాబీ బాస్ కేసీఆర్ తో భేటీ అయి చర్చలు జరిపి పొత్తు కుదుర్చుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.బిఆర్ఎస్,బీఎస్పీ పొత్తులో భాగంగా బీఎస్పీకి రెండు లోక్ సభ స్థానాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుండి ఎన్నికల బరి లో దిగనున్నారు. మరోవైపు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ను బిఆర్ఎస్ పార్టీలో చేరాలని కోరినప్పటికీ తిరస్కరించి ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడానికే ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మొగ్గు చూపారు.

       అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోడానికి కారణం, దళితులు, బలహీనవర్గాల దూరం కావడమేనన్న భావన ఉంది. రాష్ట్రంలో దళిత బంధు లాంటి పధకం కేసీఆర్ ప్రవేశపెట్టినప్పటికీ ఈసారి జరిగిన ఎన్నికల్లో దళిత సామాజిక వర్గాలు బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదని కేసీఆర్ భావిస్తున్నారు. ఇంకో వైపు ఎం.ఆర్.పి. ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద క్రిష్ణ మాదిగ బీజేపీకి మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే దళిత భావజాలం వున్న బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే దళితులు దగ్గర అవుతారని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉండటంతో స్వెరో విద్యార్ధి,యువజన, ఉద్యోగ సంఘా లు తమకు మద్దతుఇస్తాయని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో స్వెరో సంఘాలు తమకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశాయని అది తమ పార్టీ ఓటమికి దారి తీసిందని గులాబీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బిఆర్ఎస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీతో పొత్తు ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్