కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం ప్రారంభించిన స్థానం ఇదే.అంతేకాదు కాంగ్రెస్ అధిష్టానం ఈ స్థానాన్ని చాలా ప్రతీష్టా త్మకంగా తీసుకుంది. మంత్రి సీతక్క సర్వశక్తులు ధారపోసి గెలుపే లక్ష్యంగా కృషి చేసిన స్థానం ఇది. సీఎం రేవంత్ రెడ్డి సెంటిమెంట్ గా భావిస్తున్న స్థానం కావడంతో ఈ స్థానంపై మరింత ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ సిట్ఠింగ్ స్థానం పై కాంగ్రెస్ ఖచ్చితంగా జెండా ఎగరేస్తుందని కాంగ్రెస్ నేతలు బలంగా చెప్తున్నారు. బీజేపీ సిట్టింగ్ స్థానంపై కాంగ్రెస్ పట్టు సాధిస్తుందా ?ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందా? అనే అంశంపై స్వంత్రటీవీ ప్రత్యేక కథనం.
ఆదిలాబాద్ లోక సభ స్థానంపై హస్తం పార్టీ ముందు నుండి సెంటిమెంట్ గా భావించింది. ఈ నేపథ్యంలో జిల్లా ఇంచార్డీ మంత్రిగా సీతక్క పార్టీ గెలుపు బాధ్యతను పూర్తిగా తన భుజస్కందాలపై మోశారు .ఈ క్రమంలోపార్టీ గెలుపు కోసం స్థానిక నేతలతోపాటు పార్టీలో కొత్తగా చేరిన నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని చెప్తూనే లోలోపల కాంగ్రెస్ నేతలు ఓటమి భయంతో ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ ర్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కేవలం కాంగ్రెస్ నుండి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు మాత్రమే విజయం సాధించారు. మిగితా ఆరు స్థానాల్లో నలుగురు బీజేపీ, ఇద్దరు తెరాస పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో పెద్దనేతలు ఎవరు లేకపోగా నాలుగైదు నియోజకవర్గాల్లో ద్వితియ శ్రేణి నేతలతోనే నెట్టుకొచ్చారు.
ప్రస్తుతం పరిస్థితి మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్తులుగా పోటీచేసిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోనప్ప, విఠల్ రెడ్డిలతోపాటు మాజీ కేంద్ర మంత్రి వేణు గోపాలచారి, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావులతోపాటు పలువులు జడ్పీటీసీలు. సర్పంచ్ లు , ఇలా చాలా మంది నేతలు హస్తం గూటికి చేరగా పార్లమెంట్ ఎన్నికల నాటికి కాంగ్రెస్ బలమైన నేతలతో అన్ని నియోజకవర్గాల్లో క్యాడర్ తయారైంది అని భావిస్తు న్నారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గెలు నల్లేరు మీద నడకేనన్నట్టు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపే లక్ష్యంగా కొత్త, పాత నేతలు ప్రచారంలో పాల్గొన్నప్పటికీ, పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేకపోయామని పలువురు నేతలు చర్చకు తెరలేపారు. ఏడు నియోజక వర్గాల పార్టీ ఇంచార్జ్ లను సమన్వ యం చేయడంతోపాటు ఎన్నికల పార్టీ కార్యక్రమాల ఖర్చులు, కొత్త నేతల చేరికల నేపథ్యంలో ప్రచారంలో వారిని సమన్వయం చేయడం కోసం సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, టీపీసీసీ జనరల్ సెకరెటరీ కరీంనగర్ జిల్లాకు చెందిన సత్తు మల్లేష్ అనే నేతకు పూర్తి భాద్యతలను పార్టీ అప్పజెప్పింది. అయితే ఈ నేతకు నేరుగా సీఎం రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం ఉండటంతో ఈ నేత పార్టీలో ఏవరినీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించార నేది ప్రస్తుతం కాంగ్రెస్ క్యాడర్లో వినిపిస్తున్న టాక్. మంత్రి సీతక్క ఏడు నియోజకవర్గాల్లో ప్రచారాలతోపాటు నేతల సమన్వయం కోసం పాటుపడ్డప్పటికీ పార్టీకి సంబందించి, లావాదేవీల విషయంలోనే నేతల మధ్య గ్యాప్ పెరిగిందని టాక్ వినిపిస్తుంది, ఇక్కడి పోలింగ్ కంటే వారం రోజుల ముందే పోల్ మేనేజ్మెంట్ పై అంతా చేతులెత్తయడంతో కొంత పార్టీ క్యాడర్లో అయోమయం నెలకొందని చెప్పుకుంటు న్నారు. పార్లమెంట్ ఇంచార్జీగా వచ్చిన సత్తు మల్లేష్ స్వంత పార్టీ నేతలు, కార్యకర్తలతో అహంకారపూరి తంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇదిలా ఉంటే పోల్ మేనేజ్మెంట్ విషయంలో రెండు నియోజకవర్గాల్లో ఎన్నికల ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులు కార్యకర్తలకు. బూత్ ఏెజంట్లకు ఇవ్వకుండా ఇద్దరు నేతలు కాజేశారనే ప్రచారం జోరుగా సాగు తోంది. దీంతో ఎన్నికల నిర్వహణ తీరు తెలియని వ్యక్తికి, జిల్లాపై ఏ మాత్రం పట్టు లేని వ్యక్తికి భాధ్యతలు అప్పజెప్పడంతోనే హస్తం పార్టీ నేతల్లో ఐక్యత చెడిందనే ప్రచారం సాగుతోంది. ఎన్నికల ముగిసాయి. ఫలితాలు రావాల్సి ఉంది.గెలుపు పై హస్తం పార్టీ నేతల్లో ధీమా వ్యక్తమవుతున్నప్పటికీ, పోల్ మనేజ్మెంట్ లో కాంగ్రెస్ విఫలమైందనే సంకేతాలు నేతలకు స్ఫష్టంగా వెళ్లాయి. అయినా కాంగ్రెస్ నేతల్లో గెలుస్తా మేమోననే ఆశ కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే, పార్టీలో అంతర్గత విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ నేతల్లో గెలుపు అంతర్మథనం కొనసాగుతోంది. మరి గెలుపు ఎవరిని వరిస్తుందో జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే.


