25.7 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

చత్తీస్ గఢ్ బీజేపీ కోట బీటలు వారుతుందా ?

  2024 పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్న చత్తీస్ గఢ్ బీజేపీకి పెట్టని కోట. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఓ 8 ఏళ్లు తప్ప బీజేపీ యే అధికారంలో ఉంది. 2004 నుంచి ప్రతి పార్లమెంటు ఎన్నికల్లోనూ కమలదళమే ఆధిక్యత సాధిస్తూ, అత్యధిక పార్లమెంటు సీట్లు గెలుచుకుంటూ వస్తోంది. కాంగ్రెస్ మాత్రం గట్టి పోటీ ఇచ్చి ఈ సారి పైచేయి సాధించాలని సిద్ధమవుతోంది. బీజేపీ కంచుకోట బద్దలు కొట్టడమే లక్ష్యం అంటూ బాఘేల్ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ – కాంగ్రెస్ డైరెక్ట్ ఫైట్ లో గెలుపు ఎవరిదో..

   చత్తీస్ గఢ్ ఎన్నికల రాజకీయాలన్నీ ముగ్గురు ముఖ్యమంత్రులు అజిత్ జోగి, రమణ్ సింగ్ భూపేశ్ భాగెల్ చుట్టూ తిరిగింది. నక్సలైట్ల ప్రాబల్యం గల ప్రాంతం కావడంతో సవాళ్లు ఎక్కువే. చత్తీస్ గఢ్ ఏర్పాటు డిమాండ్ 1956 నుంచి ఉన్నా.. 1998 లో బీజేపీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఎన్నికల్లో వాగ్దానం చేసి 2000 నవంబర్ 1న ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.చత్తీస్ గఢ్ లో గిరిజనులే ఎక్కువ. 2000 నవంబర్ 1 న కాంగ్రెస్ కు చెందిన అజిత్ జోగి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 2003 నుంచి 20 ఏళ్ల పాటు బీజేపీనే అధికారంలో ఉంది. రమణ్ సింగ్ ఉచిత బియ్యం సరఫరా వంటి పలు సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు. సుదీర్ఘ కాలంపాటు 15 ఏళ్ల 128 రోజులు సీఎంగా ఉన్నారు. రమణ్ సింగ్ హయాంలో నక్సలిజం పెరిగిపోయిందనే భావన ఉంది. 2018లో కాంగ్రెస్ చత్తీస్ గఢ్ లో అధికారంలోకి వచ్చింది భూపేశ్ భాగెల్ సీఎం అయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీబీజేపీ అధికారం లోకి వచ్చింది. 90 సభ్యుల అసెంబ్లీలో ఏకంగా 54 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ కి చెందిన విష్ణు దేవ్ సాయి ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టారు.

2024 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా చత్తీస్ గఢ్ లోని 11 ఎంపీ నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7వ తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. చత్తీస్ గఢ్ లో మొదటి నుంచీ పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ పరంపర సాధిస్తూ వచ్చింది. 2004 లోక్ సభ ఎన్నికల్లో 11 లోక్ సభ స్థానాల్లో పది స్థానాలను బీజేపీ గెలుచుకుంది. 2009 లో బీజేపీ10 స్థానాలు, కాంగ్రెస్ 1 స్థానంలో నెగ్గింది. 2014లో కాంగ్రెస్ 1, బీజేపీ 10 స్థానాలు 2019 లో కాంగ్రెస్ 2 బీజేపీ 9 స్థానాల్లో గెలుపొందాయి. ఈ సారి మొత్తం 11 స్థానాలను గెలవాలనే వ్యూహంతో కమలదళం అడుగులు వేస్తోంది. ఈ సారి పార్లమెంటు ఎన్నికల్లో చత్తీస్ గఢ్ లోని 11 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ, 4 స్థానాల్లోనూ, గోండ్వానా గణ తంత్ర పార్టీ మూడు స్థానాల్లో జనతా కాంగ్రెస్ చత్తీస్ ఘడ్ , సీపీఐ, అంబేద్కర్ పార్టీఆఫ్ ఇండియా వంటి చిన్న చిన్న పార్టీలు ఎన్నికల గోదాలో ఉన్నాయి. ఇండియా కూటమి పేరుతో ప్రతిపక్షాలను ఏకం చేసిన కాంగ్రెస్ .. కేంద్రంలో అధికారంలో రావాలంటే.. ఎక్కువ సీట్లు గెలవాలని భావిస్తోంది.

చత్తీస్ గఢ్ లో రమణ్ సింగ్ నేతృత్వంలో బీజేపీ, భూపేశ్ బాఘేల్ నాయకత్వంలోని కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ సారి కూడా కాషాయ జెండా రెపరెపలాడుతుందని ప్రధాని మోదీ ఆశాభావంలో ఉన్నారు. 24 ఏళ్లుగా ఎంపీ ఎన్నికల్లో సాగుతున్న బీజేపీ ఆధిపత్యాన్ని ఏమేరకు అడ్డుకుం టుందో చూడాలి.

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్