కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం టీడీపీ ప్రభుత్వం కృషి చేయాలని కాంగ్రెస్ నేత తులసీరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావాలన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పా టుకు కావలసిన అన్ని హంగులూ జిల్లాలో వున్నా.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదని విమర్శిం చారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయిలో మెజారిటీ లేనందున కడప స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు.