ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకే పట్టం కట్టారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వివిధ సర్వే సంస్థల అంచనాలు వెలువడ్డాయి. ఇందులో రెండు దశాబ్దాల తర్వాత బీజేపీకే ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారని దాదాపు అన్ని సర్వే సంస్థలు ప్రకటించాయి. మూడోసారి ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలని భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో నిరాశే ఎదురైంది. ఢిల్లీ అసెంబ్లీ స్థానాలు మొత్తం 70 సీట్లు ఉండగా.. 36 సీట్లు రావాల్సి ఉంది.
పీపుల్స్ ఇన్‌సైట్ ఎగ్జిట్ పోల్
ఆప్ 25-29
బీజేపీ 40-44
కాంగ్రెస్- 4 స్థానాలు
రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్
ఆప్ 21-31
బీజేపీ 39-49
కాంగ్రెస్- 0-4 స్థానాలు
టైమ్స్ నౌ
ఆప్ 22-31
బీజేపీ 39-45
కాంగ్రెస్- 0-2 స్థానాలు
చాణక్య స్ట్రాటజీస్
ఆప్ 25-28
బీజేపీ 39-44
కాంగ్రెస్- 2-3 స్థానాలు
పోల్ డైరీ
ఆప్ 18-25
బీజేపీ 42-50
కాంగ్రెస్- 0-2 స్థానాలు
వీప్రిసైడ్
ఆప్ 46-52
బీజేపీ 18-23
కాంగ్రెస్- 0-1 స్థానాలు
మాట్రిజ్
ఆప్ 32-37
బీజేపీ 35-40
కాంగ్రెస్- 0-1 స్థానాలు
డీవీ రిసెర్చ్
ఆప్ 26-34
బీజేపీ 36-44
కాంగ్రెస్- 0-0 స్థానాలు
పీపుల్స్ పల్స్
ఆప్ 10-19
బీజేపీ 51-60
కాంగ్రెస్- 0-0 స్థానాలు