ఉన్నవాళ్లు మళ్లీ రావాలని ఆత్రంలో ఉండగా, లేనివాళ్లు గద్దెక్కి పదవుల్లో రాణించాలని తాపత్రయపడుతున్నారు. అధికార పార్టీ ఆత్రాలు, విపక్షాల తాపత్రయాలు ఎక్కడో, ఎందుకో.. ఆ పక్షాలు ఎవరో అందరికీ తెలుసు. ఢిల్లీలో పోల్స్ పూర్తవ్వగా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ మీద అందరు దృష్టిసారించారు. ఢిల్లీ అంటే ఏదో ఆషామాషీగా కిళ్లీలు వేసుకునే గల్లీ కాదు…కదా..! ఇది నేషనల్ కేపిటల్ టెర్రిటరీ, చట్టపరంగా ఏర్పాటు చేసిన జాతీయ రాజధాని ప్రదేశం. ఈ జాతీయ రాజధాని ప్రదేశాన్ని 1956 నవంబర్ 1 వ తేదీన కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన సంగతి అందరికీ విదితమే. ఇక్కడ ఎలక్షన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్, కౌంటింగ్.. ఏదన్నా.. టోటల్ వరల్డే ఆసక్తిగా చూస్తుంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పర్వం ప్రశాంతంగా పూర్తవ్వగా.. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ తంతు సాగుతోంది. ఆప్ మరోసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఎన్నో ట్రిక్స్ తో ఎన్నికల్లో కష్టపడింది హ్యాట్రిక్ కోసమే అని, మిగిలిన పార్టీలన్నింటిన ఊడ్చిపారేయాలన్ని ఆప్ ఉవ్విళూరింది. అయితే, ఆప్ ప్రయత్నాన్ని అడ్డుకుని తాను గద్దె ఎక్కేందుకు బీజేపీ విశ్వప్రయత్నం చేసింది. ఒకప్పుడు కింగ్ లా ఉండే కాంగ్రెస్ చాలాకాలంగా డంగ్ అయిపోయి, ఇప్పుడు హంగ్ అయితే చక్రం తిప్పాలని హస్తం పార్టీ ఆశగా ఉన్నట్టు తెలుస్తోంది. హస్తినపై ఎలాగోలా జెండా పాతేందుకు హస్తం పార్టీ తన వంతు అనేక ప్రయత్నాలు సాగించిన విషయం తెలిసింది.
ఢిల్లీ శాసన సభలో మొత్తం 70 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా.. 699 మంది అభ్యర్థులు పోటీచేశారు. కౌంటింగ్ తంతు ఈ నెల 8న జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్.. స్పెక్యులేషన్ పర్వం మొదలైంది.
ఢిల్లీ పీఠాన్ని దక్కించుకునేది ఎవరు అనే దానిపై వివిధ సర్వే సంస్థలు తమ అంచనాలను ప్రకటించాయి. ఢిల్లీ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదలైనప్పటినుంచి ఆప్, బీజేపీ అధికారం కోసం చేయని ప్రయత్నాలు లేవు. ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి రెండు పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేశాయి. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో రాజకీయ విమర్శలు చేసుకున్నారు. ఈక్రమంలో ఢిల్లీ ఓటర్లు ఎవరిని ఆశీర్వదించారనేది ఆసక్తిగా మారింది.
పీపుల్స్ ఇన్‌సైట్ ఎగ్జిట్ పోల్
ఆప్ 25-29
బీజేపీ 40-44
కాంగ్రెస్- 4 స్థానాలు
రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్
ఆప్ 21-31
బీజేపీ 39-49
కాంగ్రెస్- 0-4 స్థానాలు
టైమ్స్ నౌ
ఆప్ 22-31
బీజేపీ 39-45
కాంగ్రెస్- 0-2 స్థానాలు
చాణక్య స్ట్రాటజీస్
ఆప్ 25-28
బీజేపీ 39-44
కాంగ్రెస్- 2-3 స్థానాలు
పోల్ డైరీ
ఆప్ 18-25
బీజేపీ 42-50
కాంగ్రెస్- 0-2 స్థానాలు
వీప్రిసైడ్
ఆప్ 46-52
బీజేపీ 18-23
కాంగ్రెస్- 0-1 స్థానాలు
మాట్రిజ్
ఆప్ 32-37
బీజేపీ 35-40
కాంగ్రెస్- 0-1 స్థానాలు
డీవీ రిసెర్చ్
ఆప్ 26-34
బీజేపీ 36-44
కాంగ్రెస్- 0-0 స్థానాలు
పీపుల్స్ పల్స్
ఆప్ 10-19
బీజేపీ 51-60
కాంగ్రెస్- 0-0 స్థానాలు
ఢిల్లీకి రాజైనా బామ్మబాట బంగారు బాట అనే పాట ఉంది. అంటే పెద్దల మాట శిరోధార్యం అని దీని అర్థం. ఇప్పుడు ఆ ఢిల్లీకి రాజును చేసే ఢిల్లీ ప్రజా పెద్దల వాక్కు అంచనా పోల్స్ రూపంలో వెలువడింది. ఇక అసలు ఫలితాలు ఈ నెల 8న వెలువడనున్నాయి. ఏ సంస్థ ఎగ్జిట్ పోల్ హిట్ అయ్యిందో, దేనిది ఫట్ అయ్యిందో.. అంతా ఫిబ్రవరి 8 న తేలిపోతాయి. సో అనటిల్ దెన్ వెయిటు, సీ తప్పనిసరి.
—