రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలింపు వెనుక పెద్ద మాఫియా ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇదో జాతీయస్థాయి కుంభకోణమన్నారు. అక్రమ బియ్యాన్ని పట్టేందుకు బోట్లు వేసుకుని సముద్రంలో హడావిడి చేయడం కాదని.. నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా పోర్టు దాకా ఎలా చేరుతుందని ప్రశ్నించారు. మూడేళ్లలో 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎలా సేకరించారు.. దీని వెనకున్న బియ్యం దొంగలెవరని ఆమె నిలదీశారు.. రేషన్ డీలర్ల మాయాజాలమా.. నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరముందని షర్మిల సూచించారు.