కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్.. గద్దర్ పై వ్యాఖ్యలు సమంజసం కాదని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నాడా.. లేక బండి సంజయ్ ఉన్నాడా.. అంటూ ప్రశ్నించారు. అణగారిన ఉద్యమంలో గద్దర్ ఊరూరా తిరిగి పాటలు పాడి ప్రజలను చైతన్యవంతులను చేశారని అన్నారు.
కేటీఆర్, హరీశ్‌రావు తన కాలి గోటికి కూడా సరిపోరని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని చెప్పారు. నీతి, నిజాయితీకి మారు పేరు వెంకట్ రెడ్డి అంటూ తెలిపారు. ప్రతిపక్ష నేత పదవి కోసం హరీశ్‌రావు, కేటీఆర్ పోట్లాడుకుంటున్నారని అన్నారు. రేపో మాపో మూతపడే పార్టీ బీఆర్‌ఎస్ అని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి. బీఆర్ఎస్ కంటే లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ బెటర్ అని అన్నారు. లాలూ జైల్లో ఉన్నా.. ఆయన కుమారుడు పార్టీని నిలబెట్టారని చెప్పారు.