దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 25 సంవత్సరాల్లో ఇది సాధ్యమైందని తెలిపారు. ఏం చేయాలన్నా ఒక దూరదృష్టి,ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలని తెలిపారు. హైదరాబాద్‌లోని HICCలో ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరై, కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగువారు ఎక్కడున్నా రాణిస్తున్నారని సీఎం అన్నారు. 1996లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చానని గుర్తు చేశారు. ఐటీ తిండి పెడుతుందా అని అప్పట్లో ఎంతో మంది హేళన చేశారని తెలిపారు. సెల్ ఫోన్లు ప్రమోట్ చేస్తే.. ఏమన్నా ఉపయోగమా? అని ప్రశ్నించారు. కానీ ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువారు దూసుకెళ్తున్నారని తెలిపారు. భవిష్యత్ లో జరగబోయే విషయాలను మనం ముందుగానే ఆలోచించాలన్నారు. తగిన విధంగా ముందుకు వెళ్లగలిగితే ఏదైనా సాధ్యమేనని సీఎం చంద్రబాబు తెలిపారు.