21.8 C
Hyderabad
Monday, September 29, 2025
spot_img

గర్భిణీ మహిళలు సరిగా నిద్ర పోవాలంటే ఏం చేయాలి?

నిద్ర మనకి అవసరం ఎందుకు అంటే, అది మన శరీరం, మనసు, ఆరోగ్యం అన్నీ పునర్నిర్మించడానికి చాలా ముఖ్యం. ఎంత మంచి నిద్ర పడితే, అంత ఎక్కువ శక్తి కూడా అందుతుంది. రోజూ అలసట లేకుండా, పనిచేయడానికి అవసరమైన ప్రేరణ మనం నిద్ర ద్వారా తీసుకుంటాం. నిద్రలో మన మెమరీ, శక్తి చాలా పెరుగుతుంది. సరిగా నిద్రపోయి, మంచి ఆలోచనలు మనసులో వదిలేస్తాము. నిద్రతో మన శరీరంలోని హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి, అలాంటప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. అందరికీ నిద్ర అవసరం ఇంక ప్రెగ్నెన్సీ లో నిద్ర అనేది మరింత ముఖ్యమైన అంశం.

ఈ సమయంలో శరీరంలో అనేక మార్పులు వస్తున్నాయి, దీంతో మంచి నిద్ర కొంచెం కష్టంగా మారవచ్చు. కానీ, సరైన నిద్ర శరీరానికి కూడా, మనసుకు కూడా మంచి విశ్రాంతిని అందిస్తుంది.ఈ టైమ్‌లో తల్లీ ఆరోగ్యమే కాదు, బిడ్డ ఆరోగ్యం గురించి కూడా కేర్ తీసుకోవాల్సిన అవసరముంది. ప్రెగ్నెన్సీ టైమ్‌లో తల్లిని ఎన్నో విషయాలు ఎఫెక్ట్ చేస్తాయి. అలాంటి వాటిలో నిద్ర కూడా ఒకటి.

ప్రెగ్నెంట్ గా ఉన్న మహిళలకు , నిద్ర చాలా ముఖ్యమైనది, ఎందుకంటే నిద్రలోనే పొట్టలో పెరుగుతున్న బిడ్డ అవసరమైన పోషకాలు అందుకుంటాడు. సరైన నిద్ర తల్లి శరీరంలో హార్మోన్ల ఉత్పత్తిని కూడా నియంత్రించగలుగుతుంది. అలాగే, నిద్ర సమయంలో శరీరంలో జరిగే అనేక ప్రక్రియలు హార్మోన్లు, , రక్తప్రసరణలో మార్పులు గర్భస్రావం నుండి రక్షణ కలిగిస్తాయి, దీనివల్ల బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి అవసరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే, గర్భవతికి మంచి నిద్ర అన్నది కేవలం ఆమెకు మాత్రమే కాదు, ఆ బిడ్డ ఆరోగ్యానికి కూడా అవసరం.

ప్రెగ్నెన్సీ టైమ్‌లో నిద్ర సమస్యలు, నిద్రలేకపోవడం అనేది బిడ్డ ఎదుగుదలకి, అభివృద్ధికి హానికరమని డాక్టర్స్ చెబుతా రు. ప్రెగ్నెన్సీ టైమ్‌లో మంచి నిద్ర అనేది హార్మోన్స్ బ్యాలెన్స్, రక్తప్రసరణకి, ఇమ్యూనిటీని బలంగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ కూడా శిశువు హెల్త్‌కి చాలా అవసరం. నిద్రలేకపోవడమనేది తల్లిలో ఒత్తిడిని పెంచుతుంది. దీని వల్ల ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ పెరుగుతుంది. శిశువు బ్రెయిన్ డెవలప్‌మెంట్ కు ఈ కార్టిసాల్ ఇబ్బందులు కలుగజేస్తుంది. తగినంత నిద్ర లేకపోతే అది అనేక ఆరోగ్య సమస్యలకి కారణమవుతుంది. దీనివల్ల బిడ్డకి అవసరమైన పోషకాలు, ఆక్సిజన్ అందకుండా పోతుంది.

ప్రెగ్నెన్సీ మహిళలకు ఓ అద్భుత అనుభవం. తొమ్మిది నెలల కాలంలో మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీ గర్భం దాల్చడంతో శారీరకంగా చాలా మార్పులు జరుగుతాయి, ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి. ప్రసవ సమయంలో స్త్రీ భరించే నొప్పిని అంచనా వేయడం కష్టం. అయితే ఎలాంటి సమస్యలు ఉన్నా తల్లి సరైన సమయానికి తినటం, నిద్రపోవటం మాత్రం చాలా అవసరం. ఎందుకంటే నిద్రలేకపోవడం శిశువు బరువుని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. మొత్తం అభివృద్ధిని అడ్డుకుంటుంది. గర్భధారణ సమయంలో తగినంత నిద్ర చాలా అవసరమని డాక్టర్స్ చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ టైమ్‌లో తల్లి శారీరక, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. నిద్ర లేమి హైబీపి, ఒత్తిడి,మానసిక సమస్యలు సిజేరియన్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. ఇది శిశువు నాడీ వ్యవస్థ అభివృద్ధిపై నెగెటీవ్ ఇంపాక్ట్‌ని చూపుతుందట.

గర్భిణుల్లో నెలలు నిండుతున్న కొద్దీ పొట్ట పెరగడం వల్ల ఆయాసంగా, అసౌకర్యంగా అనిపించి తద్వారా నిద్ర పట్టదు. అయితే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చని అంటున్నారు నిపుణులు. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం వల్ల నిద్ర పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. పడుకునే ముందు టీవీ చూడటం, సెల్‌ఫోన్, కంప్యూటర్ వంటి గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉండాలని , వీలైతే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, గోరువెచ్చటి పాలు తాగడం.. వంటి అలవాట్ల వల్ల కూడా చక్కటి ఫలితాలు ఉంటాయని వివరిస్తున్నారు.

అలాగే ప్రెగ్నెన్సీ నిర్థరణ అయ్యాక ఏ పనీ చేయకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు కొంతమంది. అయితే అది కరెక్ట్ కాదని అంటున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీ సంబంధిత సమస్యలతో ఉంటూ.. డాక్టర్లు సలహా ఇస్తే తప్ప పూర్తి విశ్రాంతి తీసుకోవడం అవసరం లేదంటున్నారు. ఈ క్రమంలో తేలిక పాటి వ్యాయామం చేయడం వల్ల తల్లితో పాటు బిడ్డకు మేలు చేస్తుందని వివరిస్తున్నారు.

మన రోజువారీ జీవితంలో ఎదుర్కొన్న ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా రాత్రి పూట నిద్ర పట్టకుండా చేస్తాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఇంట్లో, ఆఫీసులో ఉండే పలు సమస్యలు, ప్రసవం గురించిన భయాలు నిద్రలేమికి దారితీస్తాయని చెబుతున్నారు. దీనివల్ల మీతో పాటు కడుపులో పెరుగుతున్న మీ బిడ్డకు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎక్కవగా ఆలోచించకుండా ఒత్తిడిని దూరం చేసుకొని హాయిగా నిద్రపోవాలని పేర్కొన్నారు.

నిద్ర విషయంలో మరో సమాచారం కూడా కాబోయే తల్లులను ఇబ్బంది పెడుతుంది. తప్పుడు పొజిషన్‌లో నిద్రపోతే శిశువుకు శ్వాస సమస్యలు ఉంటాయన్న ఒక వాదన ఉంది. అయితే ఈ వాదనలో నిజం లేదని డాక్టర్లు చెబుతున్నారు. కడుపులో ఉన్న బిడ్డకు గాలి పీల్చడం వల్ల ఆక్సిజన్ అందదు. బిడ్డకు ఉమ్మ నీరు అంటే మావి నుంచి ఆక్సిజన్ అందుతుంది. బిడ్డకు ఎంత ఆక్సిజన్ అందుతుంది అనేది తల్లి ఆరోగ్యం, రక్త ప్రసరణపై ఆధారపడి ఉంటుంది. గర్భం దాల్చిన మూడు నెలల తర్వాత అంటే బిడ్డ పెరుగుతున్నప్పుడు పక్కకి పడుకోవడం మంచిది. వెనుకవైపు పడుకోవడం వల్ల శరీరంలోని కుడి వైపున ఉన్న పెద్ద సిరపై ఒత్తిడి పెరుగుతుంది.

గర్భిణీ స్త్రీలు ఎడమవైపు పడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది శిశువు, ఉమ్మనీరు రెండింటికీ మంచిది. ఈ స్థానం కాలేయం నుంచి పెరుగుతున్న గర్భాశయాన్ని దూరంగా ఉంచుతుంది. ముఖ్యమైన అవయవాలకు, శిశువుకు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎడమ నుంచి కుడి వైపుకు మారడం ద్వారా గర్భధారణ సమయంలో తల్లి సౌకర్యవంతంగా, ఆరోగ్యంగా ఉండటానికి సాయపడతుంది. అలాగే పడుకోవడానికి కనీసం గంట ముందు తల, కాళ్లను సున్నితంగా మసాజ్ చేసుకోవాలని నిపుణలు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల నరాలు ఉత్తేజితమై హాయిగా నిద్ర పడుతుందట.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్