ఎన్నికల ప్రచారంలో హీట్ పెంచేందుకు కాంగ్రెస్ కొత్త స్కెచ్ వేసిందా.? మిషన్ 14 టార్గెట్ గా పనిచేస్తున్న కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాలు ఎలా ఉన్నాయి..? రేవంత్ రెడ్డి తెలంగాణలోనే కాక.. జాతీయ స్టార్ క్యాం పెయినర్‌గా సక్సస్ అవ్వగలరా.? ఇంతకీ కాంగ్రెస్ ఈ ఎన్నికలను ఎలా ఎదుర్కొనబోతోంది..? అసలు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహమేంటి.?
తెలంగాణలో నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. అన్ని పార్టీల అగ్రనేతలు ఎన్నికల ప్రచారంపై ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి నియోజకవర్గాల వారిగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. నామినేషన్ దాఖలు నుంచే ప్రచార హైప్ క్రియేట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల నామినేషన్ లో స్వయంగా సీఎం రేవంత్ పాల్గొనను న్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రచార రూట్ మ్యాప్ సిద్ధం అయింది. రేవంత్ పాల్గొనే నామినే షన్ కార్యక్రమాలు అట్టహసంగా నిర్వహించాలని, ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు కసరత్తులు ప్రారంభిం చారు. కనీసం లక్ష మందికి తగ్గకుండా ర్యాలీలు, కార్నర్ మీటింగ్, బహిరంగ సభలు నిర్వహిం చాలని ప్లాన్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడంతో మరింత ప్రచారం వేగవంతం అవుతుందని కాంగ్రెస్ అభ్యర్థులు భావిస్తున్నారు.
ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రకటించిన 14 స్థానాల్లో అభ్యర్థులు ప్రచారం వేగవంతం చేశారు. మొదటి దఫా ప్రచారంలో భాగంగా నేతలు గడప గడప ప్రచారం చేస్తున్నారు. నామినేషన్ నాటి నుంచి ప్రచారం స్పీడ్ పెంచి.. కార్నర్ మీటింగ్స్, ర్యాలీలు, సభలు పెట్టాలని చూస్తున్నారు. ప్రతి రెండు అసెంబ్లీ నియోజకవర్గా లకు ఒక్కో సభ నిర్వహిస్తే, పార్లమెంట్ పరిధిలోని ప్రతి ఓటరు వరకు తమ సందేశం వెళ్తుందని హస్తం నేతలు భావిస్తున్నారు. అందులోనూ సమయాను సారంగా అగ్రనేతల పర్యటనలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ మే మొదటి వారంలో నల్గొండ పార్లమెంట్ పరిధిలోనీ మిర్యాల గూడ, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని చౌటుప్పల్ లో ఒకే రోజు రెండు సభలు నిర్వహించనున్నట్లు రేవంత్ రెడ్డి ఆయా నియోజకవర్గ ముఖ్య నేతల భేటీలో చెప్పుకొచ్చారు. మరోవైపు ప్రచారంలో హీట్ పెంచేందుకు సీఎం పర్యటనలు ఖరారయ్యాయి. ఇప్పటికే జాతీయ స్టార్ క్యాం పెయినర్ గా అధిష్టానం రేవంత్ ను ప్రకటించి ఇతర రాష్ట్రాల ప్రచారంలో కూడా భాగస్వామిని చేసింది. దీంతో తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలు అయిన ఏపీ, మహారాష్ట్ర, ఒడిశాతో సహా ఏడు రాష్ట్రాల నుంచి ప్రచారంలో పాల్గొనాలని ఆహ్వానాలు అందాయి. దీంతో ఒక వైపు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపించు కునే ప్రయత్నాలు చేస్తూనే.. ఇతర రాష్ట్రాల ప్రచారంలో రేవంత్ పాల్గొననున్నారు.
మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీ చంద్ రెడ్డి నామినేషన్ అనంతరం కార్నర్ మీటింగ్.. ఆ తర్వాత మహబూబాబాద్ అభ్యర్థిగా బాలరామ్ నాయక్ నామినేషన్ అనంతరం నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొనను న్నారు. శనివారం మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ అనంతరం కార్నర్ మీటింగ్‌లో పాల్గొని. ఆ రోజు సాయంత్రం కర్ణాటక ప్రచారంలో పాల్గొనను న్నారు. ఈ నెల 21న భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం లో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో భువనగిరిలో భారీ ర్యాలీకి నేతలు ప్లాన్ చేస్తున్నారు. 22 న ఆదిలాబాద్ జనజాతర బహిరంగ సభ. 23న నాగర్ కర్నూల్ బహిరంగ సభ. 24న జహీరాబాద్, వరంగల్ లలో బహిరంగ సభల్లో సీఎం రేవంత్ పాల్గొననున్నారు.సీఎం రేవంత్ వరస పర్యటనలతో ప్రచార పర్వం పీక్స్ కి చేరనుంది. ఇప్పటికే కాంగ్రెస్ టార్గెట్ 14ను అందుకునేందుకు సుడిగాలి ప్రచారం మొదలు పెట్టనున్నారు. మిగిలిన మూడు నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక మరో రెండు మూడు రోజుల్లో జరగనుందనీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సీఎం వరస పర్యటనలు ఇటు రాష్ట్ర పర్యటనలు. అటు జాతీయ కాంగ్రెస్ ప్రచారం ఎలా బ్యాలెన్స్ చేస్తారో. కాంగ్రెస్ మిషన్ 14 రీచ్ అవుతుందా.? చూడాలి.