27.2 C
Hyderabad
Thursday, February 5, 2026
spot_img

వైసీపీ పరాజయానికి మైనస్ లు ఏమిటి ?

    ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఓటమికి గల కారణాలేంటి ? 2019లో 151 సీట్లలో గెలిచిన జగన్ పార్టీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి అత్యంత దారుణ మైన ఓటమిని మూటగట్టుకోవడం వెనుక మతలబేంటి ?

   ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం మూటగట్టుకుంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించిన వైసీపీ ఐదేళ్లు గడిచే సరికి పాతాళంలోకి పడిపోయిన పరిస్థితి. అసలు ఎందుకీ పరిస్థితి వైసీపీ పరాజయానికి దారి తీసిన కారణాలేంటి అన్నది ఓసారి పరిశీ లిస్తే, చాలానే ఉన్నాయి. వాటిలో మొదటిది విపరీతంగా అమలు చేసిన సంక్షేమ పథకాలు నిజమే అభి వృద్ధిని మరిచి సంక్షేమ పథకాలను విపరీతంగా అమలు చేయడంపైనే సీఎం జగన్ దృష్టి పెట్టార న్నది మొదటి నుంచీ విన్పిస్తున్న మాట. అందుకు తగినట్లుగానే వివిధ పథకాల పేరుతో లక్షల కోట్లు ప్రజలక ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్. అయితే ఈ క్రమంలోనే అత్యంత కీలకమైన అభివృద్ధిని పక్కన పెట్టే శారన్న మాట విన్పించింది.

   ప్రధానంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెద్దగా లేని పరిస్థితి నెలకొంది. పరిశ్రమలు తమ పాల నలో భారీగా వచ్చాయని, ఎంవోయూలు పెద్ద ఎత్తున కుదిరాయని వైసీపీ ప్రభుత్వం, నేతలు చెప్పినా,  అవి కార్యరూపం దాల్చక పోవడం మైనస్‌గా మారింది. ఇక, రహదారులు వైసీపీ పాలనలో దారుణంగా పాడైపోయాయి. ఒక్క జాతీయ రహదారులు మినహాయిస్తే, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఉన్న రోడ్లు దారుణంగా పాడైపోయాయి. వాటికి మరమ్మ తులు చేయించాలంటే కోట్లాది రూపాయల మేర ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ, సంక్షేమ పథకాలకు రాష్ట్ర బడ్జెట్‌లో సింహ భాగం ఖర్చవుతుండ డంతో రహదారుల దుస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్న విమర్శలున్నాయి.

    రాష్ట్రానికి రాజధాని అంటూ లేకపోవడం కూడా వైసీపీ పాలనకు మైనస్‌గా మారింది. 2014లో అమరావతికి ఓకే చెప్పిన జగన్ ఆ తర్వాత కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మూడు రాజధానులకు జైకొట్టారు. పోనీ అవైనా పూర్తి చేశారా అంటే అదీ లేదు. పైగా కోర్టు కేసులతో పరిస్థితి దారుణంగా తయా రైంది. చివరకు ఇతర రాష్ట్రాలు ఏపీకి రాజధాని కూడా లేదంటూ ఎద్దేవా చేసే పరిస్థితి వచ్చింది. పైగా అమరావతి కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు ఏళ్ల తరబడి ఉద్యమాలు చేసినా, ధర్నాలు, ఆందోళ నలు నిర్వహించినా సీఎం జగన్ ఏ మాత్రం పట్టించుకోలేదన్న విమర్శలు మొదటి నుంచీ విన్పించాయి. ఇది కూడా వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా మారింది. స్కిల్ స్కాం కేసులో అవినీతి జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపడం కూడా కొంత మేర మైనస్‌గా మారిందన్న విమర్శలున్నా యి. ఆధారాల సంగతి కాస్త పక్కనె పెడితే టీడీపీ అధినేత అరెస్ట్ విషయంలో అధికారులు వ్యవహరించిన తీరు కూడా ప్రభుత్వానికి, వైసీపీ అధినేతకు చెడ్డ పేరు తీసుకొచ్చిందన్న మాట విన్పించింది. అన్నింటి కంటే ముఖ్యమంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో టీడీపీ-జనసేన పార్టీలు కలవడం, తమతో కలిసి వచ్చేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కలుపుకోవడంతో మూడు పార్టీలు కలిసి వచ్చాయి. ఉమ్మడిగా రంగంలోకి దిగాయి. దీనికితోడు రాష్ట్రంలోని సీపీఐ, సీపీఎం, ఇతర మేథావులు, కంటికి కన్పించని శక్తులు అన్నీ వైసీపీకి వ్యతిరేకంగా మారాయి. జగన్ పార్టీ గద్దె దిగాలని బలంగా కోరుకోవడంతోపాటు గట్టి ప్రయత్నాలు చేశాయి. దీంతో వైసీపీ ఓటమి పాలుకాక తప్పలేదు.

     ఇవన్నీ ఒకవైపు ఉంటే మరోవైపు వైసీపీ ఓటమికి పార్టీ అధినేత జగన్‌ సైతం కారణమేనన్న వాదన బలంగా విన్పిస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు ఇలా ఎవరు చెప్పినా తాను అనుకున్నదే సీఎం జగన్ చేస్తారని అంటారు. ఇదే ఎన్నికల్లో మైనస్‌గా మారిందన్న ప్రచారం సాగుతోంది. పైగా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను ఎన్నికల వేళ మార్చడంతో ఆయా నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఇది కాస్తా క్షేత్ర స్థాయిలో బలంగా పని చేసింది. సీట్లు కోల్పోయన అభ్యర్థులు కొత్త వారికి సహకరించేందుకు పైకి సుము ఖంగానే కన్పించినా లోలోన మాత్రం వ్యతిరేకంగా పనిచేశారన్న వాదన విన్పి స్తోంది. లాస్ట్ బట్‌ నాట్ లీస్ట్ అన్నట్లుగా ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ విషయంలో విపక్షాలు చేసిన ఆందోళన ఫలించిందనే చెప్పాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల్లో పెల్లుబికిన అసంతృప్తి కూడా వైసీపీ పరాజయానికి ప్రధాన కారణ మనే చెప్పాలి. తమకు రావాల్సిన బకాయిలను, ఇంక్రిమెంట్లను ఇవ్వడంలో వైసీపీ సర్కారు చేసిన ఆలస్యంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు లోలోన రగిలిపోతూ సమయం రాగానే తమ వంతుగా వైసీపీకి వ్యతిరేకంగా మీట నొక్కారు. దీంతో వైసీపీ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్