26.2 C
Hyderabad
Friday, January 16, 2026
spot_img

ఆరోపణలు నిరూపిస్తే ఉరేసుకుంటా: బ్రిజ్‌భూషణ్‌

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తనపై రెజ్లర్లు చేస్తున్న ఆరోపణల్లో ఒక్కటి నిరూపించినా ఉరేసుకొంటానని రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(WFI) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ సవాలు చేశారు. ఢిల్లీ పోలీసులు FIR నమోదచేశారు కనుక ఈ విషయం గురించి తాను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదన్నారు. ఆరోపణలు చేసిన వారి దగ్గర ఏమైనా వీడియో ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు. తన గురించి రెజ్లింగ్‌కు సంబంధించిన వారిని ఎవరినైనా అడగండి తెలిపారు. దేశంలో రెజ్లింగ్‌ క్రీడాభివృద్ధి కోసం 11 ఏళ్లు కష్టపడ్డానని ఓ వీడియో సందేశం విడుదలు చేశారు.

బ్రిజ్‌భూషణ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ టాప్‌ రెజ్లర్లు వినేష్‌ ఫొగాట్‌, సాక్షి మాలిక్‌ తదితరులు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో ఏప్రిల్ 28వ తేదీన బ్రిజ్‌ భూషణ్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. ఇప్పటికే రెజర్ల అందోళనకు సంయుక్త కిసాన్‌ మోర్చాతో పాటు పలు పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు.

Also Read: ఢిల్లీలో రెజ్లర్ల ఆందోళనకు రైతులు మద్దతు

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్