- ఆటవెలది పద్యాలతో పెళ్లిపత్రిక వీడియో రూపకల్పన
- హైదరాబాద్ నిజాంపేటలో పెళ్లివేడుక
హైదరాబాద్: ఇంటింటికి తిరిగి కుంకుమబొట్టు పెట్టి, పత్రికలు ఇచ్చి, పెళ్లికి ఆహ్వానించడం పాత పద్దతి. రోజులు మారుతున్న కొద్దీ.. పెళ్లిపిలుపుల్లోనూ.. శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డీజే మ్యూజిక్‌లతో యానిమేషన్ కార్డులు తయారు చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి స్నేహితులను ఆహ్వానిస్తుండటం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. అయితే, ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతూనే ఆటవెలది పద్యాలతో.. పెళ్లికి కొత్తగా ఆహ్వానించడం అందర్నీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఆటవెలది పద్యాల సమాహార పెళ్లి పిలుపు వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.