MVR స్టూడియోస్ పైన డాక్టర్ మిద్దె విజయవాణి సమర్పణలో, వెంకటరమణ మిద్దె స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా ” వెడ్డింగ్ డైరీస్ “. బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా , చాందిని తమిలారసన్ హీరోయిన్ గా నటించిన కుటుంబ కథా చిత్రం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 23 న విడుదల కి సిద్ధమైనది ఈ సందర్భంగా చిత్ర బృందం టిజర్ ని విడుదల చేసారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత వెంకటరమణ మిద్దె మాట్లాడుతూ ‘‘వివాహిత జంట తమ సంబంధంలోని ఇబ్బందులు, సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో చూపిస్తుంది. రోజూ వచ్చే విభేదాలు, నిరాశతో విసిగి వారు విడిపోవాలని నిర్ణయిస్తారు. కానీ, తర్వాత ప్రేమను, తమ బంధాన్ని ఎంత విలువైనదో గుర్తించి మళ్లీ కలుసుకుని, పెళ్లిని పునర్నిర్మించుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ చిత్రం ప్రేమ మరియు దీర్ఘకాలిక సంబంధాలపై ఉన్న విలువలను వివరిస్తుంది. ఆగస్టు 23న థియేటర్లలో మా సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం”. అని చెప్పారు.
అర్జున్ అంబటి, చాందిని తమిళరసన్, చమ్మక్ చంద్ర, మేక రామకృష్ణ, రవి తేజ నటించిన ఈ సినిమాకి మదన్ ఎస్.కే సంగీతం అందించారు.